శనివారం 16 జనవరి 2021
Nirmal - Sep 09, 2020 , 02:25:15

పేదింట కల్యాణ కాంతులు

పేదింట కల్యాణ కాంతులు

  •   n  ఆడబిడ్డలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
  •   n  కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌  పథకం ద్వారా ఆర్థిక సాయం
  •   n  ఇటీవల ఉమ్మడి మండలంలో      231 మంది లబ్ధిదారులకు  చెక్కుల అందజేత

నార్నూర్‌ : నిరుపేద ఆడబిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం  అండగా ని లుస్తున్నది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తూ ఆదుకుంటున్నది. పథకం ప్రారంభంలో రూ.51 వేలు ఇవ్వగా, ప్రస్తుతం రూ.లక్ష116 అందిస్తున్నారు. వెనుకబడ్డ అన్ని వర్గాల వారికి ఈ పథకం వర్తిస్తుండడంతో ఆర్థికంగా ఎంతగానో ఉపయోగపడుతుందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మండలంలో ఇటీవల 213 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కు లు మంజూరు కాగా, గాదిగూడలో ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆ త్రం సక్కు, నార్నూర్‌లో జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి సంక్షోభంలోనూ ప్రభుత్వం సం క్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నదని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆదుకుంటున్నదని, రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని లబ్ధిదారులు పేర్కొంటున్నారు.