శుక్రవారం 22 జనవరి 2021
Nirmal - Sep 08, 2020 , 01:31:48

ఈనెలాఖరులోగా పనులు పూర్తి చేయాలి

ఈనెలాఖరులోగా పనులు పూర్తి చేయాలి

  •  మంచిర్యాల కలెక్టర్‌ భారతీ

వేమనపల్లి: మండలంలో శ్మశాన వాటిక, రైతు వేదిక, డంపింగ్‌యార్డుల నిర్మాణాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని మంచిర్యాల కలెక్టర్‌ భారతీ హోళికేరి అధికారులను ఆదేశించారు. మండలంలోని నీల్వాయి, గొర్లపల్లి, బుయ్యారం, వేమనపల్లిలో సోమవారం శ్మశాన వాటిక, రైతు వేదిక భవన నిర్మాణ పనులను ఆమె సోమవారం   పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పనులు నాణ్యతతో చేపట్టాలని పేర్కొన్నా రు. అభివృద్ధి పనులను అధికారులు, సర్పంచ్‌లు ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే శాఖపరమైన చర్యలు ఉం టాయని తెలిపారు. ఎంపీడీవో లక్ష్మీనారాయణ, పీఆర్‌ ఏఈ శ్రీధర్‌, సర్పంచ్‌లు కుబిడె మధూకర్‌, గాలి మధు, మోర్ల పద్మ, ఏఈవో సంతోష్‌,   పం చాయతీ కార్యదర్శులు ప్రవీణ్‌, రాములు, వెంకటనారాయణ ఉన్నారు. అనంతరం చామనపల్లి గ్రామంలో శ్మశాన వాటిక పనులను ఎంపీవో అనిల్‌కుమార్‌తో కలిసి డీపీవో, మండల ప్రత్యేకాధికా రి నారాయణ పరిశీలించారు. కార్యదర్శి వేణుకుమార్‌,  సర్పంచ్‌ మొండి ఉన్నారు.

కోటపల్లి: రైతు వేదిక పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ భారతీ హోళికేరి ఆదేశిం చారు. కోటపల్లి, మల్లంపేట గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదికలను ఆమె పరిశీలించారు. నాణ్యతతో కూడిన పనులు చేయాలని, సిబ్బందికి సూచించా రు. సిర్సా గ్రామంలో రైతువేదిక పనుల ఆలస్యం పై కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు. త్వరగా పూ ర్తయ్యేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని పీఆర్‌ డీఈ స్వా మిరెడ్డిని ఆదేశించారు.  మం డల వ్యవసాయ శా ఖ అధికారి మహేందర్‌, పీఆర్‌ ఏఈ రాజశేఖర్‌, సూపరింటెండెంట్‌ లక్ష్మయ్య, ఏ ఈవోలు వైష్ణవి, రాజ్‌ కుమార్‌ పాల్గొన్నారు.


logo