బుధవారం 20 జనవరి 2021
Nirmal - Sep 08, 2020 , 01:32:10

అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి..

అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి..

  • n ముథోల్‌ ఎమ్మెల్యే జీ విఠల్‌రెడ్డి
  • n లబ్ధిదారులకు చెక్కులు అందజేత

ముథోల్‌: అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి అన్నారు.  ముథోల్‌లోని తహసీల్‌ కార్యాలయంలో 141 షాదీముబారక్‌, కల్యాణ లక్ష్మి  చెక్కులను సోమవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం అనేక పథకాల ను ప్రవేశ పెడుతున్నదని చెప్పారు. ఇప్పటికే ము థోల్‌లో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పనులు కొనసా గుతున్నాయన్నారు. ఐకేపీలో రుణం ద్వారా మం జూరైన ఆటోను అష్టకు చెందిన లక్ష్మికి అందజేశా రు. ముథోల్‌ సర్పంచ్‌ రాజేందర్‌, నాయకులు రవీందర్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, సూర్యం రెడ్డి, తహసీల్దార్‌ లోకేశ్వర్‌రావు, తదితరులున్నారు. 

బాసర: మండలకేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో అర్హులైన 98 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను సోమవారం పంపిణీ చేశారు.  అన్ని వర్గాల అభ్యున్నతి కి సీఎం కేసీఆర్‌ సారథ్యంలో ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాస్‌ప్రసాద్‌,  పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకటేశ్‌గౌ డ్‌, వైస్‌ ఎంపీపీ నర్సింగ్‌రావు, నాయకులు రమే శ్‌, జిడ్డు మల్లయ్య, మల్కన్నయాదవ్‌, పవన్‌రా వు, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. logo