అందమైన పెద్ద పెద్ద బిల్డింగులు.. విద్యుత్ కాంతుల్లో మెరిసిపోయే కార్పొరేట్ కార్యాలయాలు.. ఇవి హైదరాబాద్ నగరంలో కనిపించే దృశ్యాలు. ఒకప్పుడు భాగ్యనగరంలో పచ్చదనానికి పెద్దగా కనిపించేది కాదు. అక్కడక్కడా విసిరేసినట్టుగా కనిపించే పార్కులు మినహా.. అందమైన చెట్లకు చోటు ఉండేది కాదు. కానీ తెలంగాణ సర్కార్ వచ్చాక భాగ్యనగరంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు విశేష కృషి చేస్తోంది. లక్షలాది మొక్కలను నాటడంతో పాటు.. భారీగా పార్కులను అందుబాటులోకి తెచ్చింది. మొక్కలకు ఎప్పటికప్పుడు నీళ్లు పడుతూ వాటిని కాపాడుతుంది. అలాగే హుస్సేన్ సాగర్ సహా నగరంలోని వ్యర్థాలను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ పచ్చదనం, పరిశుభ్రతను పాటిస్తుంది.