శుక్రవారం 22 జనవరి 2021
Nirmal - Sep 07, 2020 , 01:45:19

మెరుగైన సేవలు అందించాలి

మెరుగైన సేవలు అందించాలి

భైంసా : ప్రభుత్వ దవాఖానలో మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ జూమ్‌ యాప్‌ ద్వారా వైద్యులకు సూ చించారు. జూమ్‌ యాప్‌ ద్వారా వైద్యులకు ఆదివారం  అవగాహన కల్పించారు. కరోనా కాలంలో ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది రోగులకు నిరంతరాయంగా సేవలు అందించాలని సూచించారు. ఎవరికైనా కరోనా వచ్చిందని భయపడాల్సిన అవస రం లేదని, వైద్యులను సంప్రదించాలని తెలిపా రు. ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవాల సంఖ్య పెంచేలా చూడాలన్నారు. సమావేశంలో వైద్యులు ఖలీమ్‌, సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.logo