శనివారం 16 జనవరి 2021
Nirmal - Sep 06, 2020 , 02:35:36

ప్రసూతి దవాఖాన అభివృద్ధ్దికి చర్యలు చేపట్టాలి

ప్రసూతి దవాఖాన అభివృద్ధ్దికి చర్యలు చేపట్టాలి

  • n నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ 

నిర్మల్‌ అర్బన్‌ : నిర్మల్‌ పట్టణంలోని ప్రసూతి దవాఖాన అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రసూతి వైద్యశాలలో మౌలిక సదుపాయాల నిర్మాణాలను శనివారం వైద్యాధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ద వాఖానకు వచ్చే రోగులకు వైద్యులు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ మె రుగైన వైద్య సేవలు అందించాలన్నారు. దవాఖానలోనే ప్రసవాలు జరిగేలా చూ డాలని పేర్కొన్నారు. ప్రతివార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు చేపట్టిన నిర్మాణాలను వెంట నే పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, ఏరియా దవాఖాన సూపరింటెండెం ట్‌ డాక్టర్‌ దేవేందర్‌ రెడ్డి, పంచాయతీ రాజ్‌ శాఖ ఈఈ సుదర్శన్‌ రావు, తదితరులున్నారు.

రైతు వేదిక నిర్మాణం పరిశీలన..

సారంగాపూర్‌: సారంగాపూర్‌లో చేపడుతున్న రైతువేదిక భవన నిర్మాణ పనులను కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ శనివారం పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలన్నా రు. ఈయన వెంట అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, ఎంపీడీవో సరోజ, డీటీ సంతోష్‌, ఆర్‌ఐ ముంతాజ్‌ ఉన్నారు.