కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించాలి

- n ప్రతి నెలా జిల్లా కార్యాలయానికి రిపోర్టు చేయాలి
- n కేటాయించిన తేదీల్లో వైద్య శిబిరం నిర్వహించాలి
- n ఆదిలాబాద్ డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్
ఎదులాపురం : జిల్లా వ్యాప్తంగా పీహెచ్‌సీలకు కేటాయించిన తేదీల్లో శిబిరాలు నిర్వహించి కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించాలని సంబంధిత నోడల్ అధికారులను ఆదిలాబాద్ డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ ఆదేశించారు. కేసులను ప్రతినెలా జిల్లా కార్యాలయానికి రిపోర్టు చేయాలని సూచించారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో శుక్రవారం అదనపు డీఎంహెచ్‌వో(ఎయిడ్స్, లెప్రసి) శ్రీకాంత్‌తో కలిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముందుగా వ్యాధిని గుర్తిస్తే ఆరునెలల నుంచి సంవత్సరంలోపే నయమయ్యే అవకాశం ఉంటుందన్నారు. జిల్లా కేంద్రంలోని తిర్పెల్లికాలనీ సమీపంలోని జాతీయ రహదారికి ఆనుకొని కుష్టు వ్యాధిగ్రస్తుల కాలనీలో 12 మంది ఉన్నారని తెలిపారు. వారిని వారం వారం పర్యవేక్షించి, కావాల్సిన మందులను ఇస్తున్నామని వెల్లడించారు. త్వరలోనే కాలనీ చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని, కలెక్టర్‌కు అందిస్తామన్నారు. అనంతరం అదనపు డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. జిల్లాలో 47 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారని, ప్రస్తుతం ప్రభుత్వం తరఫున వారికి నెలకు రూ.3 వేలు ఇస్తున్నట్లు చెప్పారు. ఎంసీఏ చెప్పులు, సెల్ఫ్ కేర్ కిట్, అంత్యోదయ కార్డుతో నెలకు 35 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. వ్యాధి నిర్మూలనకు కృషిచేయాలన్నారు. ఈ సమావేశంలో డీపీఎంవోలు వామన్వార్, మధుసూదనాచారి, ల్యాబ్‌టెక్నీషియన్ రమణాచారి తదితరులు ఉన్నారు.
కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచాలి..
ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాలు, మండలాలు, పట్టణాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలను పెంచాలని వైద్యాధికారులకు డీఎంహెచ్‌వో సూ చించారు. తన కార్యాలయంలో జిల్లా వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. బాధితుల ఆ రోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉం డాలన్నారు. శిబిరాలు నిర్వహిస్తున్న సమయం లో వైద్యులు, సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్లా సర్వైవ్‌లెన్స్ అధికారి వైసీ శ్రీనివాస్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ విజయసారథి, ఎన్సీడీసీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ క్రాంతి, వైద్యాధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఏపీలో కొత్తగా 158 కరోనా కేసులు
- మెరుగ్గానే శశికళ ఆరోగ్యం
- రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ డైరెక్టర్‌గా సంగక్కర
- శరీరంలో ఈ 7 అవయవాలు లేకున్నా బతికేయొచ్చు!!
- వ్యాక్సిన్ల సామర్థ్యంపై బ్రిటన్ మంత్రి హెచ్చరిక
- కాలా గాజర్.. ఆరోగ్య సమస్యలు పరార్
- ఎస్సీ, ఎస్టీలకు ఇంటింటికి కొత్త పథకం : మంత్రి ఎర్రబెల్లి
- శ్రీష్టి గోస్వామి.. ఒక్క రోజు సీఎం
- బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే మసీదులు కూల్చడం ఖాయం
- ఇంటర్ విద్యార్థిని అదృశ్యం..