శుక్రవారం 22 జనవరి 2021
Nirmal - Sep 05, 2020 , 01:54:22

కరోనాను జయించిన ఎమ్మెల్యే దంపతులు

కరోనాను జయించిన ఎమ్మెల్యే దంపతులు

  • n ఘనస్వాగతం పలికిన టీఆర్‌ఎస్‌ నాయకులు
  • n జాగ్రత్తలు పాటించాలని  ప్రజలకు కోనేరు కోనప్ప సూచన 

కాగజ్‌నగర్‌టౌన్‌ : సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప-రమాదేవి దంపతులు కరోనాను జయించారు. ఇటీవల కొవిడ్‌-19 పాజిటివ్‌ నిర్ధారణ కాగా, హైదరాబాద్‌లో చికిత్స పొందారు. కాగా, కోలుకొని శుక్రవారం తిరిగి రాగా, స్థానిక రాజీవ్‌గాంధీ చౌరస్తా వద్ద టీఆర్‌ఎస్‌ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే కోనప్ప మాట్లాడుతూ.. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రజలంతా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులు విజయసంకేతాన్ని చూపిస్తూ.. జాగ్రత్తలు పాటిస్తే కరోనా రాకుండా నివారించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గిరీశ్‌కుమార్‌, కౌన్సిలర్లు, కో-ఆప్షన్‌ సభ్యులు, టీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు ఉన్నారు. logo