గురువారం 21 జనవరి 2021
Nirmal - Sep 05, 2020 , 01:54:23

చెరువుల రక్షణకు చర్యలు

చెరువుల రక్షణకు చర్యలు

  • n నిర్మల్‌ కలెక్టర్‌  ముషారఫ్‌ అలీ ఫారూఖీ
  • n అధికారులతో ప్రత్యేక సమావేశం

నిర్మల్‌ టౌన్‌ : జిల్లాలోని చెరువు భూములు ఆ క్రమణకు గురికాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఆర్డీవోలను నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆర్డీవోలతో చెరువుల రక్షణపై ప్రత్యేక స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. జిల్లాలోని చెరువు భూములను కొందరు ఆక్రమించుకొని పంటలు సాగు చేస్తున్నా రన్నారు. రెవెన్యూ, తూనికలు, ల్యాండ్‌ రికా ర్డు, నీటి పారుదల శాఖల అధికారులతో కలిసి హద్దులు ఏర్పాటు చేసి, సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. భూములు ఆక్రమించుకున్న వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. వారానికోసారి నివేదికలను అందజేయాలని సూచించారు. తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. 

అభివృద్ధి పనుల్లో  వేగం పెంచాలి..

హరితహారం, పల్లె ప్రకృతి వనాలు, శ్మశానవాటికలు, సెగ్రిగేషన్‌ షెడ్లు, రైతువేదికల పనులను వేగం గా పూర్తిచేయాలని ఎంపీడీవోలను కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో అధికారులతో అభివృద్ధి పనులపై సమావేశం నిర్వహించారు. రోజూవారీ పనులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. పనులు వెనుకబడ్డ చోట ప్రత్యేక శ్రద్ధచూపాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.


logo