అభివృద్ధికి కృషి చేయాలి

- ఎంపీపీ తుల శ్రీనివాస్
బోథ్ : మండలాభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు. బుధవా రం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. గ్రామాల్లో కరోనా నియంత్రణకు జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజా సం క్షేమమే ధ్యేయంగా అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు ముందుకు వెళ్లాలన్నారు. సమస్యలున్న గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు దృష్టి పెట్టాలన్నారు. వ్యవసాయ శాఖ, విద్య, వైద్యం, పశు వైద్యం, పౌర సరఫరాలు, ఐకేపీ, ఈజీఎస్, అటవీ, విద్యుత్, తాగునీరు, పంచాయతీరాజ్ శాఖ, తదితర శాఖల అధికారులు అభివృద్ధిపై సమీక్షించారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను వివరించారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ సంధ్యారాణి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు తా హెర్బీన్ సలాం, తహసీల్దార్ శివలాల్, వైస్ ఎంపీపీ లిం బాజీ, ఎంపీడీవో రాధ, పీఆర్ డీఈ శైలేందర్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాలి..
తాంసి: ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీపీ ఎస్ మంజుల సూచించారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామాల్లో పల్లె ప్రకృతి వనం, రైతు వేదికలు, డంప్ యార్డు, కంపోస్టు షెడ్లను త్వరగా నిర్మించాలని సూచించారు. అనంతరం వ్యవసాయ శాఖ ఏవో రవీందర్ మాట్లాడుతూ, నూతనంగా పట్టా పాసు పుస్తకం పొందిన రైతులు ఈనెల 5వ తేదీలోగా రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. పంటలకు అవసరమైనంత మేరకే రైతులు యూరియా వేసేలా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలన్నారు. ఐకేపీ ఏపీఎం రవీందర్ మాట్లాడుతూ, మండలంలోని 340 స్వయం సహాయక సంఘాలకు ఈ యేడు 5.73 కోట్ల రుణాలు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తాటిపెల్లి రాజు, ఎంపీడీవో భూమయ్య, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీటీసీలు వన్నెల పండిత, అశోక్, రేఖ, సర్పంచ్‌లు స్వప్న, సదానందం, వెంకన్న, సరితారెడ్డి తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- అనుమానం వద్దు.. తొలి టీకా నేనే వేయించుకుంటా : మంత్రి ఈటల
- వన్యప్రాణి వధ.. ఇద్దరిపై కేసు నమోదు
- భారీ మొసలిని కాపాడిన వన్యప్రాణుల సంరక్షకులు
- మిలిటరీతో లింక్స్:జియోమీపై ట్రంప్ నిషేధం!
- ప్రణాళికా బద్దంగా పని చేయాలి : వినోద్ కుమార్
- కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లపై మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష
- తెలంగాణ ఓటరు జాబితా ప్రకటన..
- మోడీ అనుచరుడికి మండలి సీటు
- స్టాక్స్ ’ఫ్రై’డే: నిమిషానికి రూ.575 కోట్లు లాస్
- పిస్టల్‌తో బర్త్‌డే కేక్ కటింగ్.. వీడియో వైరల్