శుక్రవారం 15 జనవరి 2021
Nirmal - Sep 02, 2020 , 02:48:34

ప్రాణహితకు తగ్గని వరద ఉధృతి

ప్రాణహితకు తగ్గని వరద ఉధృతి

  •   బెజ్జూర్‌, కోటపల్లి మండలాల్లో నీట మునిగిన పంటలు   n  అధికారుల పరిశీలన

బెజ్జూర్‌: ప్రాణహిత ఉధృతి మంగళవారం మరిం త పెరిగింది. దీంతో మండలంలోని సుస్మీర్‌, నాగెపల్లి శివారుల్లోని పత్తి పంట నీట మునిగింది. వరద నీటిలో సుమారు 14 వందల ఎకరాల పత్తిపంట నీటి మునిగినట్లు ఏడీఏ తెలిపారు. కాగా త లాయి, తిక్కపల్లి, భీమారం గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. నీటి మునిగిన పంటలను మంగళవారం కాగజ్‌నగర్‌ ఆర్డీవో చిత్రు, తహసీల్దార్‌ రవీందర్‌తో కలిసి పరిశీలించారు. వరద నీ రు పాపన్‌ పేట గ్రామానికి సమీపంగా రాగా, నీట మునిగిన పంటలను నాటు పడవపై వెళ్లి ఆయన పరిశీలించారు. పంటల మునకపై సర్పంచ్‌ బుజా డి శేఖర్‌ ను అడిగి తెలుసుకున్నారు.  ఎగువ నుం చి 18 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, ఉధృ తి పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. దిగువన మేడిగడ్డ వద్ద మొత్తం గేట్లు ఎత్తినప్పటికీ ఎగు వ నుంచి భారీగా నీటి ప్రవాహం రావడంతో ఉ ధృతి తగ్గడం లేదు. సంబంధిత అధికారులతో నష్టపోయిన పంటలపై సర్వేలు నిర్వహించనున్న ట్లు ఆర్డీవో తెలిపారు. పాపన్‌ పేట గ్రామ సమీపంలోని వంతెనతో పాటు పాత సోమిని-తలాయి గ్రామాల మధ్య నిర్మించిన హై లెవల్‌ వంతెన నీటి మునిగింది. ఆర్‌ఐ రాంసింగ్‌ రాథోడ్‌, ఏఈవోలు రవితేజ, మారుతి, శ్రీధర్‌, వీఆర్వోలు, ఉన్నారు.

కోటపల్లి: మండలంలో ప్రాణహిత ఉప్పొంగి ప్రవ హిస్తున్నది. దీంతో నదీతీర గ్రామాలైన వెంచపల్లి, సూపాక, జనగామ, ఆలు గామ, పుల్లగామ, సిర్సా, అర్జునగుట్ట గ్రామాల సమీపంలో సాగు చేస్తున్న వే ల ఎకరాల పత్తిపంట నీట మునిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు గేట్లు పూర్తిగా ఎత్తివేసినప్పటికీ, ప్రాణహిత ప్రవాహం పెరుగుతున్నది. జనగామ గ్రామ సమీపంలోని ఎత్తిపోతల పథకం, వైకుంఠధామాలు మునిగిపోయాయి.  దేవులవాడ, రాంపూర్‌, కొల్లూరు గ్రామాల సమీపంలోని పత్తి, మిరప చే లల్లోకి వరదనీరు వచ్చి చేరుతోంది. సరిహద్దు గ్రామాల ప్రజలను అధికా రులు అప్రమత్తం చేశారు. నీట మునిగిన పంటలను తహసీల్దార్‌ రామ చంద్రయ్య, మండల వ్యవసాయ అధికారి మహేందర్‌, ఏఈవోలు అనూష, వైష్ణవి పరిశీలించారు. సర్పంచ్‌లు గట్టు లక్ష్మణ్‌ గౌడ్‌, కుమ్మరి సంతోష్‌, ఎం పీటీసీ మారిశెట్టి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.