సోమవారం 30 నవంబర్ 2020
Nirmal - Sep 01, 2020 , 02:25:46

నిర్మల్‌లో పోలీసుల ఫ్లాగ్‌ మార్చ్‌

నిర్మల్‌లో పోలీసుల ఫ్లాగ్‌ మార్చ్‌

నిర్మల్‌ అర్బన్‌ : నిర్మల్‌ పట్టణంలో మంగళవారం వినాయక నిమజ్జనాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు సోమవారం సాయంత్రం పోలీసులు ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు. స్థానిక డీఎస్పీ కార్యాలయం నుంచి ప్రారంభించిన పోలీసు కవాతు పట్టణంలోని పలు వీధుల గుండా సాగింది. శోభాయాత్రలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రార్థనా మందిరాలపై కవర్లను ఏర్పాటు చేశారు. నిర్మల్‌ డీఎస్పీ ఉపేందర్‌ రెడ్డి, సీఐ జాన్‌దివాకర్‌, జీవన్‌ రెడ్డి ఉన్నారు.

నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన డీఎస్పీ

నిర్మల్‌ పట్టణంలో మంగళవారం వినాయక నిమజ్జనోత్సవం నిర్వహించనుండగా, సోమవారం నిర్మల్‌ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, పట్టణ సీఐ జాన్‌దివాకర్‌ పరిశీలించారు. బంగల్‌పేట్‌, వినాయకసాగర్‌తో పాటు నిమజ్జనం చేసే ప్రదేశాలను పరిశీలించారు. కొవిడ్‌-19 నిబంధనల ప్రకారం శోభాయాత్ర నిర్వహించాలని సూచించారు. ఆయన వెంట మున్సిపల్‌ డీఈ సంతోష్‌, కౌన్సిలరు, నాయకులు ఉన్నారు.