శనివారం 05 డిసెంబర్ 2020
Nirmal - Sep 01, 2020 , 02:25:47

ఉప్పొంగిన ‘ప్రాణహిత’

ఉప్పొంగిన ‘ప్రాణహిత’

  • నీట మునిగిన పంటలు
  • ఎగువన కురుస్తున్న వర్షాలకు పోటెత్తుతున్న వరద
  • బెజ్జూర్‌, దహెగాం మండలాల్లో వందల ఎకరాల్లో నష్టం
  • పరిశీలించిన అధికారులు, ప్రజాప్రతినిధులు  n సర్కారుకు నివేదికలు

బెజ్జూర్‌/దహెగాం/చింతలమానేపల్లి/పెంచికల్‌ పేట్‌/సిర్పూర్‌-టీ/కోటపల్లి : మహారాష్ట్రలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. కుమ్రం భీం ఆసిఫాబా ద్‌ జిల్లాలోని పలు మండలాల్లో వందలాది ఎకరాల పంటలు నీట మునిగాయి. బెజ్జూర్‌ మండ లం తలాయి, భీమారం, తిక్కపల్లి గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. చుట్టూ వరద చేరడంతో ఆయా గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఆదివారం రాత్రి నుంచి వరద ఉధృతి క్రమంగా పెరుగుతున్నది. మొగవెళ్లి, సోమిని, తలాయి, తిక్కపల్లి, పాపన్‌పేట శివారులలో వందలాది ఎకరాల పత్తి నీట మునిగింది. సోమవారం ఏడీఏ రాజులనాయుడు, తహసీల్దార్‌ రవీందర్‌, ఎస్‌ఐ సాగర్‌ నీట మునిగిన పంటలను పరిశీలించారు. సుమారు 600 నుంచి 700 ఎకరాల్లో పంటలు నీటి మునిగినట్లు ప్రాథమిక అంచనా వేసినట్లు ఏడీఏ తెలిపారు. ఉన్నతాధికారులకు నివేదికలు పంపించనున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక జడ్పీటీసీ సభ్యురాలు పుష్పలత, ఎంపీటీసీ సభ్యుడు సాయి, సర్పంచ్‌ శారదతో కలిసి పంటలను పరిశీలించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఏడీఏ వెంట ఆర్‌ఐ రాంసింగ్‌ రాథోడ్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ రమేశ్‌, ఏఈవోలు రవితేజ, మారుతి, శ్రీధర్‌, ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌ ఉన్నారు. దహెగాం మండలం మొట్లగూడ, రాంపూర్‌, రావులపల్లి గ్రామాల్లో వేలాది ఎకరాల పత్తి, కంది, వరి నీట మునిగాయి. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి పంట నష్టంపై త్వరలో సర్వే చేయిస్తామని జడ్పీటీసీ శ్రీరామారావు, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ సంతోష్‌గౌడ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పెంచికల్‌పేట మండలం మురళీగూడ, జిల్లెడ, కమ్మర్‌గాం, నందిగాం, తేల్లపల్లి గ్రామాల్లో సుమారు 400 ఎకరాలు నీట మునిగాయి. సర్పంచ్‌ పొర్తెటి ఈశ్వరి రైతులతో కలిసి పంటలను పరిశీలించారు.  చింతలమానేప ల్లి మండలం దిందా-కేతిని వాగు నిండుగా ప్ర వహిస్తున్నది. సిర్పూర్‌(టీ) మండలం మాకిడి, జ క్కాపూర్‌, హుడ్కులీ, వెంకట్రావ్‌పేట్‌, లోనవెల్లి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధి కారులు హెచ్చరించారు.మంచిర్యాల జిల్లా కోట పల్లి మండలం జనగామ, ఆలుగామ, వెంచపల్లి, సిర్సా, పుల్లగామ, అన్నారం, అర్జునగుట్ట, సూ పా క గ్రామాల్లో వేల ఎకరాల పత్తి పంట నీట ము ని గింది. తహశీల్దార్‌ రామచంద్రయ్య, ఏవోమ హేం దర్‌, ఏఈవో అనూష పంటలను పరిశీలించారు.