మత్స్యకారుల అభివృద్ధే ధ్యేయం

సారంగాపూర్ / దిలావర్పూర్ : ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టులో సమీకృత మత్స్యశాఖ పథకం (ఐఎఫ్‌డీఎస్) ద్వారా సబ్సిడీ చేపపిల్లలను ఆదివారం వదిలా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మత్స్యకారు ల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. చేపలు పట్టే వారికి నిర్మల్‌లో మార్కెట్ సౌకర్యం కూడా ఉందని పేర్కొన్నారు. మత్స్యకారులకు వలలు, మోపెడ్లు, నాలుగు చక్రాల వాహనాలు, ఐస్‌పెట్టెలు ఉచితంగా అందిస్తుందన్నారు. స్వర్ణ ప్రాజెక్టులో కేజ్‌కల్చర్‌ను ఏర్పాటు చేసుకుంటే చేపపిల్లలను ఉత్పత్తి చేసుకోవచ్చని తెలిపారు. మత్స్యకారుల కోసం నిర్మల్‌లో రూ.1.50 కోట్లతో మత్స్యభవన్, పట్టణంలో రూ.50 లక్షలతో ఫిష్ మార్కెట్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పా రు. మిషన్‌కాకతీయతో చెరువులు సస్యశ్యామలం చేశామన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ..
సారంగాపూర్ మండల ప్రజాపరిషత్ కార్యాలయం, దిలావర్పూర్లోని షాదీఖానలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. పేదింటి ఆడబిడ్డలకు పెద్దన్నలా సీఎం కేసీఆర్ రూ.1,00,116 అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. కార్యక్రమాల్లో ఆర్డీవో రాథోడ్ రమేశ్, మత్స్యశాఖ డీఈ దేవేందర్‌రెడ్డి, ఎంపీపీలు అట్ల మహిపాల్‌రెడ్డి, ఏలాల అమృత, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లా వెంకట్రాంరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ ఐర నారాయణరెడ్డి, మంత్రి సోదరుడు అల్లోల మురళీధర్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ వంగ రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ మాధవరావు, సర్పంచ్‌లు ఆయేషా సిద్ధిఖీ, మురళీకృష్ణ, సుజాత, భోజరాజ్, రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీలు భోజారెడ్డి, సామల పద్మ, మహిపాల్ వనజ, టీఆర్ఎస్ దిలావర్పూర్ మండలాధ్యక్షుడు కొమ్ముల దేవేందర్‌రెడ్డి, జిల్లాపరిషత్ కోఆప్షన్ సభ్యుడు డాక్టర్ సుభాష్‌రావు, బన్సపల్లి సహకార సంఘం చైర్మన్ పీవీ రమణారెడ్డి, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు ఏలాల చిన్నారెడ్డి, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు కోడె రాజేశ్వర్, ఎఫ్ఏసీఎస్ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, ఎంపీటీసీలు పాల్దె అక్షర, అనిల్, మండల ఉపాధ్యక్షుడు బాబురావు, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు ధనె రవి, ఒడ్నం కృష్ణ, సప్పల రవి, కోడె నవీన్, సర్పంచ్‌లు సవిత, గంగారెడ్డి, రాజు, తిరుమల, శ్రీనివాస్, తహసీల్దార్ సంతోష్‌రెడ్డి, ఆర్ఐ రవి, ఎంపీడీవో మోహన్‌రెడ్డి, ఎంపీవో అజీజ్‌ఖాన్, వీఆర్వోలు సత్తార్, నాయకులు జీవన్‌రావు, రాజ్‌మహ్మద్, కండెల భోజన్న, సాయికృష్ణ, ఆయిటి చందు, ఆది, లక్ష్మీనారాయణ, ప్రభాకర్‌రెడ్డి, మల్లేశ్, కత్తెరపాక భూమేశ్, మధుకర్, సాగర్‌రెడ్డి, ఇస్మాయిల్, మారుతి, తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- రేషన్ డోర్ డెలివరీ వాహనాలను ప్రారంభించనున్న జగన్
- మహేష్ ఫిట్నెస్ గోల్స్.. వీడియో వైరల్
- ‘కొవిడ్ నెగెటివ్’ నిబంధన ఎత్తేసిన పూరీ జగన్నాథ్ ట్రస్ట్
- శాకుంతలం చిత్రంపై గాసిప్స్.. క్లారిటీ ఇచ్చిన గుణశేఖర్
- పాతబస్తీలో పేలిన సిలిండర్.. 13 మందికి గాయాలు
- అరుణాచల్‌ప్రదేశ్ మాజీ గవర్నర్ కన్నుమూత
- ఈ రాశులవారికి.. ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి
- యువత సమాజానికి ఉపయోగపడాలి
- బాధితులకు జడ్పీ చైర్మన్ పరామర్శ
- శిక్షణను సద్వినియోగం చేసుకోండి