సోమవారం 25 జనవరి 2021
Nirmal - Aug 31, 2020 , 00:18:04

వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రఫీలో ఉమ్మడి జిల్లాకు రెండు అవార్డులు

వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రఫీలో ఉమ్మడి జిల్లాకు రెండు అవార్డులు

నిర్మల్‌, నమస్తే తెలంగాణ : లైఫ్‌ కన్జర్వేషన్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన జాతీయ స్థాయి ఫొటోగ్రఫీ అవార్డుల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు రెండు అవార్డులు దక్కాయి. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో సెకండ్‌, థర్డ్‌ ప్లేసుల్లో అవార్డులను తెలంగాణ అటవీ శాఖ అధికారులు సాధించారు. ఆదిలాబాద్‌ ఫారెస్ట్‌ డివిజనల్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్న చంద్రశేఖర్‌రావు, తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న తిప్పేశ్వర్‌ అభయారణ్యంలో తీసిన రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ ఫొటోకు బెస్ట్‌ సెకండ్‌ ప్లేస్‌ విన్నర్‌గాను, జన్నారం డివిజన్‌ అధికారిగా ఉన్న సిరిపురం మాధవరావు కవ్వాల్‌ అభయారణ్యంలో తీసిన అరుదైన జాతికి చెందిన గద్ద ఫొటోకు (కెస్టెడ్‌ హాక్‌ ఈగల్‌) మూడో స్థానం దక్కింది. బెస్ట్‌ ఫొటోగ్రఫీ అవార్డులను సాధించిన ఇద్దరు అటవీశాఖ అధికారులను ఆ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్‌.శోభ, ఇతర ఉన్నతాధికారులు అభినందించారు. దేశవ్యాప్తంగా అవార్డులు సాధించిన ఫొటోలను వైల్డ్‌లైఫ్‌ కన్జర్వేషన్‌ సొసైటీ తమ వెబ్‌సైట్‌లో, సోషల్‌ మీడియా పేజీల్లోనూ ప్రదర్శిస్తున్నది.



logo