మంగళవారం 19 జనవరి 2021
Nirmal - Aug 29, 2020 , 02:24:18

వేగంగా అమలు చేయాలి

వేగంగా అమలు చేయాలి

నిర్మల్‌ టౌన్‌ : ప్రభుత్వ సంక్షేమ పథకాలను వేగంగా అమలు చేసి, ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూర్చేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ సూచించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆత్మ ఆధ్వర్యంలో అమలు చేస్తు న్న ప్రభుత్వ పథకాలపై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కుటీర పరిశ్రమలతో పాటు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదన్నారు. ముఖ్యంగా వాటి అనుబంధ పరిశ్రమల స్థాపనకు బ్యాంకులు ముందుకురావాలని సూచించారు. రైతులందరికీ లక్ష్యం మేరకు రుణాలను అందించాలన్నారు. ఆత్మ నిర్భర్‌ అభియాన్‌ కింద అర్హులకు రుణాలు అందించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌  హేమంత్‌ బోర్కడే, డీఆర్డీవో వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్‌, వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్‌, ఉద్యానవనశాఖ అధికారి శరత్‌బాబు, పశు సంవర్ధకశాఖ అధికారి రమేశ్‌కుమార్‌ పాల్గొన్నారు.