Nirmal
- Aug 27, 2020 , 02:39:18
ఏఎస్పీ మృతికి మంత్రి సంతాపం

- నిర్మల్లో టీఆర్ఎస్ నాయకుల నివాళి
నిర్మల్ అర్బన్: జగిత్యాల ఏఎస్పీ దక్షిణామూర్తి మృతిపై మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. నిర్మల్ ఏఎస్పీగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ హోదాల్లో ఆయన సుదీర్ఘంగా పనిచేశార ని ముఖ్యంగా మేడారం జాతర ప్రత్యేక అధికారిగా సమర్థవంతంగా విధులు నిర్వహించారన్నారు. నిర్మల్ పట్టణంలోని విశ్రాంతి భవనంలో టీఆర్ఎస్ నాయకులు ఏఎస్పీకి నివాళు లర్పించారు. దక్షిణామూర్తి చిత్రపటానికి టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పాకాల రాంచందర్ పూలమాల వేసి నివాళులర్పించారు. నాయకులు పద్మనాభం, గొనుగోపుల కిషన్, రాజు గౌడ్, మల్లికార్జున్, మహేశ్, సత్యనారాయణ, రాజేశ్వర్ తదితరులున్నారు.
తాజావార్తలు
- మంత్ర ఆఫ్ యూత్.. బై యూత్.. ఫర్ యూత్
- హత్య కేసు నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు
- జనవరిలోనే రవితేజ ‘క్రాక్’ ఓటిటిలో విడుదల..?
- చిరంజీవితో మరోసారి జతకడుతున్న నయనతార?
- కళ్ల కింద నల్లటి వలయాలా? ఇవి తినండి
- సిన్సినాటి డెమోక్రాట్ మేయర్ అభ్యర్థిగా ఇండో అమెరికన్
- ఈ ఐదింటిని భోజనంలో భాగం చేసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
- పదోన్నతుల ప్రక్రియ వేగంగా పూర్తిచేయాలి : సీఎస్
- తొలి రోజు సక్సెస్.. 1.65 లక్షల మందికి కరోనా టీకా
- గ్రామగ్రామాన వైకుంఠధామాల నిర్మాణం : మంత్రి పువ్వాడ
MOST READ
TRENDING