ప్రభుత్వ భూములను పరిరక్షించాలి

నిర్మల్ టౌన్ : జిల్లాలోని ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని తహసీల్దార్లను నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూ ఖీ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం భూముల సంరక్షణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ భూములను గుర్తించి, ఆక్రమణకు గురికాకుండా హద్దులు ఏర్పాటు చేయాలన్నారు. నోటీసు బోర్డులు పెట్టాలని సూచించారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న వక్ఫ్ భూముల వివరాలు తెలుసుకొని, ఎవరి ఆధీనంలో ఉన్నాయో నివేదికలను అందించాలన్నారు. అలాగే అసైన్డ్, అటవీ, ఇనాం భూములను గుర్తించాలని సూచించారు. భూములను ఆక్రమించుకున్న వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తహసీల్ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ పాలన అమలయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో డీఆర్వో సోమేశ్వర్, రెవెన్యూ అధికారి రాజు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
‘పల్లె ప్రగతి’ పనులు వేగవంతం చేయాలి
పల్లె ప్రగతి పనులను వేగంగా పూర్తిచేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పనులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సెగ్రిగేషన్ షెడ్డు, ప్రకృతివనాలు, శ్మ శానవాటికల నిర్మాణం, హరితహారం పనులు వేగంగా పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలన్నారు. నిత్యం పర్యవేక్షించాలని కార్యదర్శులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, డీఆర్డీవో వెంకటేశ్వర్లు, డీపీవో వెంకటేశ్వర్రా వు, జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్ పాల్గొన్నారు.
రైతు వేదికల నిర్మాణ పనుల పరిశీలన..
సోన్ : మండలంలోని కడ్తాల్ గ్రామంలో రైతు వేదిక నిర్మాణ పనులను కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పరిశీలించారు. పను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. కలెక్టర్ వెంట ఎఫ్ఎస్సీఎస్ మాజీ చైర్మన్ రాంకిషన్, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణప్రసాద్ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మి, సర్పంచ్ లక్ష్మీనర్సయ్య, ఉప సర్పంచ్ సాయందర్ తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- ట్రంప్ కొత్త పార్టీ పెట్టడం లేదు..
- ఈ 'కుక్క' మాకూ కావాలి
- చైనాలో ఇంటర్నెట్ స్టార్ గా మారిన 4ఏళ్ల చిన్నారి, స్పేస్ సూట్ లో పీపీఈ కిట్
- కరోనా టీకా తీసుకున్న ఎమ్మెల్యే సంజయ్
- మురికివాడలో మెరిసిన ముత్యం..సెలబ్రిటీలను ఫిదా చేసిన మలీషా
- అమెరికాలో కాల్పులు.. గర్భిణి సహా ఐదుగురు మృతి
- వ్యవసాయ చట్టాలతో రైతులపై ప్రధాని దాడి: రాహుల్‌గాంధీ
- వనపర్తి జిల్లాలో గుప్త నిధులు?
- రకుల్ కోవిడ్ రికవరీ జర్నీ- వీడియో
- కాంగ్రెస్ అధికారంలోలేదు.. భవిష్యత్‌లో రాదు