గురువారం 21 జనవరి 2021
Nirmal - Aug 20, 2020 , 03:34:31

‘ఈ స్ఫూర్తి అందరికీ ఆదర్శం’

‘ఈ స్ఫూర్తి అందరికీ ఆదర్శం’

సోన్‌ / నిర్మల్‌ టౌన్‌ : రైతు వేదికల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో నిర్మల్‌ మండలంలోని చిట్యాల్‌ గ్రామంలో నెల రోజుల్లోనే 90 శాతం పనులు పూర్తి చేయడం అందరికీ స్ఫూర్తిదాయకమని నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ అన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ పడకంటి రమేశ్‌రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. బుధవారం సాయంత్రం గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక పనులను పరిశీలించారు. వర్షాకాలంలోనూ వేగంగా పనులు జరిగేలా చూ స్తున్న రమేశ్‌రెడ్డిని అభినందించారు. ఈయన వెంట అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, పంచాయతీరాజ్‌ డీఈ తుకారాం పాల్గొన్నారు. 

నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటాలి

నిర్దేశించిన లక్ష్యం మేరకు తెలంగాణ హరితహారంలో అన్ని శాఖల అ ధికారులు మొక్కలు నాటాలని కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో హరితహారంపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆగ స్టు 31 వరకు మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, అటవీశాఖ అధికారి సుతాన్‌, ఏఎస్పీ రాంరెడ్డి, డీఆర్వో సోమేశ్వర్‌, డీఆర్డీవో వెంకటేశ్వర్లు, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు. logo