శుక్రవారం 15 జనవరి 2021
Nirmal - Aug 20, 2020 , 03:34:50

ఘనంగా బొడుగ పండుగ

ఘనంగా బొడుగ పండుగ

ఇంద్రవెల్లి : గిరిజన గ్రామాల్లో ఆదివాసులు శివదేవతకు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంద్రవెల్లి మండలకేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో పొలాల పం డుగను పురస్కరించుకొని మరుసటిరోజు గిరిజనుల ఆధ్వ ర్యంలో నిర్వహించే బొడుగ (బొడగ) పండుగ  సందర్భం గా  శివదేవతకు గిరిజన సంప్రదాయ ప్రకారం ప్రత్యేక పూ జలు నిర్వహించారు. ఇందుకోసం ఆదివాసులు గ్రామాల నుంచి తెల్లవారు జామున జాగేమహతరి అంటూ గ్రామం లోని పొలిమేరకు చేరుకున్నారు. శివదేవతకు ఆదివాసీ గిరి జన సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించి నైవే ద్యాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనం తరం పూజలకు తరలివచ్చిన ఆదివాసులందరూ కలిసి కట్టుగా కూర్చొని ఇంటి నుంచి వెంట తీసుకొచ్చిన నైవే ద్యాలను ఒకే జాగాలో అన్నింటినీ కలిపారు. వాటిని తిరిగి అందరూ పంచుకొని భుజించారు. శివదేవత ప్రత్యేక పూజ ల తర్వాతత వనమూలిక ఔషధ మొక్కలను సేకరించి ఇండ్లకు తీసుకెళ్లారు. పొలాల పండుగ మరుసటి రోజున శివదేవతకు ప్రత్యేక పూజలు చేస్తే గ్రామాల్లో ఈగలు, దోమ ల నివారణ జరుగుతుందని ఆదివాసీ గిరిజన పెద్దలు తెలి పారు. గ్రామాల్లో ప్రజలకు వివిధ రకాల వ్యాధులు ప్రబ లకుండా ఉంటాయని, ఈ పూజలతో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని గిరిజన పెద్దలు పేర్కొన్నారు.