గురువారం 28 జనవరి 2021
Nirmal - Aug 19, 2020 , 02:44:22

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

  • n మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు
  • n పోతపల్లి వాగు పరిశీలన

లక్షెట్టిపేట రూరల్‌ : వర్షాలతో వాగుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నదని, సమీప గ్రామాల సర్పంచ్‌లు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు హెచ్చరించారు. మంగళవారం పోతపల్లి, శాంతాపూర్‌, అంకతిపల్లి సర్పంచ్‌లతో కలిసి పోతపల్లి వాగును పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కడెం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తున్నారని, గోదావరి పరిసర ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జాలర్లు చేపల వేటకు వెళ్లకుండా చూడాలని సూచించారు.ఆయన వెంట పోతపల్లి సర్పంచ్‌ ఆసాది పురుషోత్తం, సుధాకర్‌, ఎర్రవేణి శ్రీకాంత్‌ గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, ఉపాధ్యక్షుడు రమేశ్‌, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డి, రవి ఉన్నారు.

ప్లాస్మా దానానికి ముందుకు రావాలి 

మంచిర్యాల టౌన్‌ : కరోనా పాజిటివ్‌ వచ్చి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలని  ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు కోరారు. నడిపెల్లి చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ నడిపెల్లి విజిత్‌రావు పిలుపు మేరకు మంచిర్యాలలోని అర్చన టెక్స్‌ యజమాని గురిజాల అనూప్‌ హైదరాబాద్‌కు వెళ్లి ప్లాస్మా దానం చేయడం గొప్ప విషయమన్నారు. అనూప్‌ను ప్రత్యేకంగా అభినందించారు. టీఆర్‌ఎస్‌ నాయకులు సన్మానించారు. నడిపెల్లి చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ విజిత్‌రావు, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు గాదెసత్యం, నాయకులు తోట తిరుపతి, చంద్రశేఖర్‌ హండే, గౌసొద్దీన్‌, ఖాజామియా, వెంకన్న తదితరులు ఉన్నారు.


logo