శనివారం 16 జనవరి 2021
Nirmal - Aug 18, 2020 , 03:00:24

పనులు వేగవంతం చేయాలి

పనులు వేగవంతం చేయాలి

  • n నిర్మల్‌ అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే

పెంబి : పల్లె ప్రకృతి వనాల పనులను వేగవంతం చేయాలని నిర్మల్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే అధికారులను ఆదేశించారు. నిర్మల్‌ జిల్లా పెంబి మండలంలోని నాగాపూర్‌, మందపల్లి గ్రామాల్లో సోమవారం  పర్యటించారు. అభివృద్ధి పనులను పరిశీలించారు. సెగ్రిగేషన్‌ షెడ్లు, శ్మశాన వాటికల నిర్మాణ పనులు, ప్రకృతి వనాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. పర్యావరణ రక్షణకు, గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం కల్పించడానికి ప్రభుత్వం పల్లెల్లో ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నదన్నారు. ఇందులో రకరకాల మొక్కలు నాటి, పిల్లలు ఆడుకోవడానికి అన్ని సౌకర్యాలతో సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. గ్రామాల్లో అనుకూలమైన ప్రాంతాల్లో పార్క్‌ ఏర్పాటు చేయాలన్నారు. అభివృద్ధి పనుల్లో జాప్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీవో చిక్యాల రత్నాకర్‌రావు, సర్పంచ్‌ చెర్పూరి సుధాకర్‌ పాల్గొన్నారు.