బుధవారం 27 జనవరి 2021
Nirmal - Aug 17, 2020 , 00:59:12

అలుగు దూకుతున్న చెరువులు..

అలుగు దూకుతున్న చెరువులు..

నిర్మల్‌, నమస్తే తెలంగాణ : నిర్మల్‌ జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజులుగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తున్నది. ఆదివారం జిల్లాలో సగటున 20.90 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కుభీర్‌ మండలంలో 49.5 మి.మీ. నర్సాపూర్‌(జి)లో 22 మి.మీ. కురిసింది. భైంసా మండలంలో 42.7, కుం టాలలో 34.2, లోకేశ్వరంలో 29.3, తానూర్‌లో 28, బాసరలో 27, ముథోల్‌లో 26.4, దిలావర్‌పూర్‌లో 26.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఈ ఏడాది సాధారణ సగటు వర్షపాతం 1127.6 మి.మీ. కా గా.. జూన్‌ 1 నుంచి ఇప్పటి వరకు సాధారణ సగ టు వర్షపాతం 669.5 మి.మీ. కురయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 489.10 మి.మీ. నమోదైంది. సాధారణ సగటు వర్షపాతం కం టే 27 శాతం తక్కువగా కురిసింది. గతేడాది ఇదే సమయానికి 581.4 మి.మీ. వర్షం కు రియగా.. ఈ సారి 16శాతం తక్కువగా నమోదైంది. జిల్లాలో కేవలం ఐదు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా.. మిగతా 14 మండలాల్లో సాధారణం కంటే తక్కువ కురిసింది. కుభీర్‌, తానూర్‌, బాసర, ముథో ల్‌, సారంగాపూర్‌ మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. 

ఎడతెరిపి లేకుండా..

ఎడతెరిపి లేని వర్షంతో పంట పొలాల్లో నీరు నిలిచింది. మరోవైపు పట్టణాలు, పల్లెల్లో లోతట్టు ప్రాంతాలు జలమయంకాగా.. కొన్ని చో ట్ల పాత ఇండ్లు కూలిపోయా యి. రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. ఖానాపూర్‌ మండలం పాత ఎల్లాపూర్‌-బీర్నంది మధ్య చింత ఒర్రె పొంగడంతో రహదారి మీదుగా నీరు పారుతున్నది. ఖానాపూర్‌ శివారులోని చౌరస్తాలో చెట్లు విరిగి పడగా.. పోలీసులు తొలగించారు. బాసర మండలం కిర్గుల్‌(కె)లో ఆదివారం తెల్లవారుజామున ప్రభుత్వ పాఠశాల భవనం గోడ కూలింది. నాలుగైదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున.. ప్రజ లు అప్రమత్తంగా ఉండాల ని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ సూచించారు. భైంసా మండలం మహాగాంలో చెక్‌డ్యాం నిండడం తో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.  

ప్రాజెక్టులు జలకళ..

జిల్లాలోని ప్రధాన రిజర్వాయర్లు, ప్రాజెక్టు లు, చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. ఎస్సారెస్పీతోపాటు కడెం, స్వర్ణ, గడ్డెన్నవాగు, సదర్మాట్‌ ఆనకట్టకు ఎగువ ప్రాంతాల నుంచి వరద వచ్చి చేరుతున్నది. ఎ స్సారెస్పీ పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 1077.10 అడుగుల (44.950 టీఎంసీలు) నీరు ఉంది. ఈ ఏడాది జూన్‌ 1 నుంచి ఇప్పటి వరకు ఎస్సారెస్పీలోకి 29.76 టీఎంసీల వరద వచ్చి చేరింది. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి మట్టం 700 అడుగులు (7.603 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 697 అడుగులు (6.97 టీఎంసీలు) నీరుంది. ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుంచి 3600 క్యూసెక్కుల వరద వస్తున్నది. గడ్డెన్న వాగు ప్రాజెక్టు పూర్తి స్థాయి మట్టం 1176.5 అడుగులు (1.852 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1173. 25 అడుగు లు (1.366 టీఎంసీలు) నీరుంది. ఎగువ ప్రాంతం నుంచి రెండు వేల క్యూసెక్కుల వర ద వస్తున్నది. స్వర్ణ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1183 అడుగులు (1.48 47 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 1183 అడుగుల (1.4 840 టీఎంసీలు) నీ రుంది. ఎగువ ప్రాంతం నుంచి 5820 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. రెండు గేట్లు ఎత్తి 6750 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నా రు. సదర్మాట్‌ ఆనకట్ట ప్రస్తుత నీటి మట్టం తొ మ్మిది అడుగులు కాగా.. అడ్డుగోడపై నుంచి 12 వేల క్యూసెక్కుల నీరు గోదావరిలో కలుస్తున్నది. విపత్కర పరిస్థితుల్లో జిల్లా ప్రజలు డయల్‌ 100, 9440900680 నంబర్లకు ఫో న్‌ చేయాలని పోలీసులు సూచించారు.

మంత్రి అల్లోల సమీక్ష

భారీ వర్షాలు, వరదలపై ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివా రం సాయంత్రం నాలుగు జిల్లాల కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడారు. లోతట్టు గ్రామాల పరిస్థితిపై వాకబు చేయాలని ఆదేశాలిచ్చారు. కలెక్టర్లు, ఎస్పీలు పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు. 


logo