శనివారం 23 జనవరి 2021
Nirmal - Aug 17, 2020 , 00:48:39

పండుగలు నిరాడంబరంగా నిర్వహించాలి

పండుగలు నిరాడంబరంగా నిర్వహించాలి

నిర్మల్‌, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో వినాయక చవితి, మొహర్రం పండుగలను నిరాడంబరంగా నిర్వహించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రజలకు సూచించారు. ఆయన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు వినాయక చవితి ఉత్సవాలు, మొహర్రం వేడుకలను జనసమూహం లేకుండా ఎవరింట్లో వారే జరుపుకోవాలన్నారు. సామూహిక నిమజ్జనాలు, ప్రార్థనలు చేయవద్దని కోరారు. కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ పండుగలు నిర్వహించుకోవాలని, ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. నిబంధనల్లో భాగంగా భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ఇందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. logo