సోమవారం 18 జనవరి 2021
Nirmal - Aug 16, 2020 , 23:12:02

10 గంటలకు.. 10 నిమిషాలు..

 10 గంటలకు.. 10 నిమిషాలు..

నిర్మల్‌ అర్బన్‌ : ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు కార్యక్రమంలో భాగంగా మంత్రి అల్లోల.. నిర్మల్‌లోని క్యాంప్‌ కార్యాలయం, తన ఇంటి ఆవరణలో వర్షపు నీటిని తొలగించి, గార్డెన్‌లో మొక్కలను సరిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదురోజులుగా కురుస్తున్న వర్షాలతో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ చైర్మన్‌ ధర్మాజీ రాజేందర్‌, ఎంపీపీ కొరిపల్లి రామేశ్వర్‌ రెడ్డి, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ మాజీ చైర్మన్‌ రాంకిషన్‌రెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు ముత్యం రెడ్డి, నాయకులు చనిగారపు నరేశ్‌ పాల్గొన్నారు.