ఆదివారం 24 జనవరి 2021
Nirmal - Aug 15, 2020 , 23:57:44

జిల్లాలో ఆధునిక వైద్య సేవలు

జిల్లాలో ఆధునిక వైద్య సేవలు

  • n మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి
  • n ఆదిత్య దవాఖానలో కార్డియాలజీ విభాగం ప్రారంభం

నిర్మల్‌ అర్బన్‌: జిల్లా అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి సా ధిస్తున్నదని, హైదరాబాద్‌ తరహాలో ఉండే అత్యవసర వైద్య సేవలు నిర్మల్‌ పట్టణంలో అందుబాటులో ఉండడమే ఇందు కు నిదర్శనమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆదిత్య దవాఖానలో ఏర్పాటు చేసిన కార్డియాలజీ (హృదయ సంబంధిత) విభాగాన్ని ఆయన శనివా రం ప్రారంభించారు. అనంతరం మంత్రి  మాట్లాడుతూ ఉ మ్మడి జిల్లాలో మొదటి కార్డియాలజీ వైద్య సేవలను నిర్మల్‌ లో ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఉమ్మడి జిల్లా ప్రజలు సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి, జడ్పీ చైర్‌ పర్సన్‌ విజయలక్ష్మి, నిర్మల్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొంగరి నర్మద, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ మాజీ చైర్మన్‌ రాంకిషన్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, వైద్యులు ప్రమోద్‌ చందర్‌ రెడ్డి, స్వర్ణరెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు ముత్యం రెడ్డి ఉన్నారు.


logo