శుక్రవారం 22 జనవరి 2021
Nirmal - Aug 15, 2020 , 23:57:47

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

  •   ఖానాపూర్‌ ఎమ్మెల్యే  అజ్మీరా రేఖానాయక్‌  n   పట్టణంలో ఆర్వో ప్లాంట్‌, మరుగుదొడ్లు ప్రారంభం

ఖానాపూర్‌:  ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు. పట్టణంలోని సామాజిక సర్కారు దవాఖానలో రూ. 1.10 లక్షలతో ఏర్పాటు చేసిన తాగునీటి ఆర్వో ప్లాంట్‌ను ము న్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌, మెడికల్‌ సూపరింటెండెంట్‌ వంశీమాధవ్‌తో కలిసి శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దవాఖానకు వచ్చే రోగులు, వారి వెంట వచ్చే సహాయకులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకే ప్లాంట్‌ను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా ఉన్న దవాఖాన ప్రాంగణంలో నిర్మించిన ప్రజా మరుగుదొడ్డిని ఆమె ప్రారంభించారు. మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులకు కిట్లు అందజేశారు. తహసీల్దార్‌ జనుము నారాయణ, మున్సిపల్‌ కమిషనర్‌ తోట గంగాధర్‌, కౌన్సిలర్‌ కావలి సంతోష్‌, నాయకులు జన్నారపు శంకర్‌, తూము చరణ్‌, డాక్టర్‌ ఖాన్‌, పూసల మనోజ్‌, గొర్రె గంగాధర్‌, మొయిన్‌, గుగ్గిళ్ల రాజేందర్‌, అంజద్‌ఖాన్‌, ప్రదీప్‌,  సుమన్‌ పాల్గొన్నారు. 

భైంసా: పట్టణంలోని ప్రభుత్వ ఏరియా దవాఖాన సమీపంలో, డీఎ స్పీ కార్యాలయం ఎదుట నిర్మించిన మరుగుదొడ్లను శనివారం మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జాబీర్‌ హైమద్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  భైంసాకు వివిధ పనుల కోసం ప్రజలు అధిక సంఖ్యలో వస్తుంటారని, వారిని దృష్టిలో పెట్టుకొని ప్రధాన కార్యాలయాల వద్ద మరుగుదొడ్లు ఏర్పాటు చేశామన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ ఖదీర్‌, డీఈ నాగేశ్వర్‌రావు, కౌన్సిలర్లు  ఉన్నారు.


logo