నందనవనంగా తీర్చిదిద్దాలి

- n ఇంద్రవెల్లి తహసీల్దార్ రాఘవేంద్రరావు, ఎంపీడీవో రమాకాంత్
ఇంద్రవెల్లి : ప్రకృతి వనాలను మొక్కలతో నందనవనంగా తీర్చిదిద్దాలని తహసీల్దార్ రాఘవేంద్రరావు, ఎంపీడీవో రమాకాం త్ అన్నారు. మండలంలోని ముత్నూర్ గ్రామంలో ప్రకృతి వనం పనులను శనివారం ఆయన ప్రారంభించారు. అనంత రం అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి వనాలను చూసేందుకు వచ్చే ప్రజలకు వివిధ రకాల మొక్కలతోపాటు ఆహ్లాదకరమైన వాతావర ణం కల్పించాలన్నారు. వారి వెంట డిప్యూటీ తహసీల్దార్ జా దవ్ భీంరావు, ఎంపీవో సంతోష్, ఏపీవో సంతోష్ జైస్వాల్, ఈసీ జాదవ్ శ్రీనివాస్, టీఏ చౌహాన్ ప్రకాశ్, పంచాయతీ కార్యదర్శి నసీమా పాల్గొన్నారు.
బోథ్ : ప్రకృతి వనాలతో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుందని ఎంపీడీవో సీహెచ్ రాధ అన్నారు. మండలంలోని సాంగ్విపల్లెలో ఏర్పాటు చేస్తున్న ప్రకృతి వనంలో శనివారం ఆమె మొ క్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వనంలో నా టిన మొక్కలు చెట్టుగా ఎదిగేలా చర్యలు చేపట్టాలన్నారు. సూ పరింటెండెంట్ సుధాకర్‌రెడ్డి, ఎంపీవో జీవన్‌రెడ్డి, టీఏ ప్రకా శ్, జేపీఎస్ అరుంధతి, జగదీశ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
భీంపూర్: మండలంలోని బేల్సరిరాంపూర్ ప్రకృతివనంలో శనివారం ఎంపీపీ కుడిమెత రత్నప్రభ, జడ్పీటీసీ కుమ్ర సుధాకర్ స్థానికులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం యువకులు శ్రమదానం చేశారు. 2000 రకాల వివిధ జాతుల మొ క్కలు నాటనున్నామని సర్పంచ్ రూప తెలిపారు. టీఆర్ఎస్ మండల కన్వీనర్ మేకల నాగయ్య, నాయకులు కుడిమెత సం తోష్ , అమృత్ , చిన్ను, అధికారులు ఉన్నారు.
తాజావార్తలు
- ఇండియన్ ఎంబసీపై ఖలిస్తానీ మద్దతుదారుల దాడి!
- గోపిచంద్ సీటీమార్ చిత్ర రిలీజ్ డేట్ ఫిక్స్
- లీటర్ నీళ్లు..కాస్త బ్లీచింగ్ తో వెలుగులు
- ఎన్టీపీసీ మూడో విడుత పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల
- కిసాన్ ర్యాలీ హింస.. దీప్ సిద్దూపై కేసు నమోదు!
- ఇంగ్లండ్‌లో టీమిండియాతో ఇండియా 'ఎ' ఢీ
- మొక్కల పెంపకమే.. భవిష్యత్ తరాలకు తరగని ఆస్తి
- ముంబైని యూటీ చేయండి..
- మద్యం మత్తులో ‘కోయిలమ్మ’ సీరియల్ నటుడు వీరంగం
- 20 మంది రైతు సంఘాల ప్రతినిధులకు నోటీసులు