బుధవారం 30 సెప్టెంబర్ 2020
Nirmal - Aug 14, 2020 , 00:17:20

మెరుగైన వైద్యం అందించాలి

మెరుగైన వైద్యం అందించాలి

  • అదనపు డీఎంహెచ్‌వో మనోహర్‌

ఉట్నూర్‌ రూరల్‌: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని అదనపు డీఎంహెచ్‌వో మ నోహర్‌ సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని దంతన్‌పెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని  గురువారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ పీహెచ్‌సీ పరిధిలో 18 కరోనా కేసులు నమోదయ్యాయని, వైద్య సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభావిత గ్రామాల్లో వైద్య సేవలు ముమ్మరం చేయాలన్నారు. ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఆరోగ్య ఉప కేంద్రాల్లో గర్భిణులకు ప్రతి సోమవారం పరీక్షలు నిర్వహించాలని సూచించారు. విటమిన్‌ ఏ ద్రావణాన్ని 9 నెలల నుంచి 5 సంవత్సరాల్లోపు చిన్నారులకు తాగించాలని పేర్కొన్నారు. ప్రజలకు 102, 104, 108 సేవలు, దోమ తెరల వాడకంపై అవగాహన కల్పించాలన్నారు. ఏఎంవో వెంకటేశ్వర్లు, డాక్టర్‌ అనురాధ, నూర్‌సింగ్‌, కైలాస్‌, ఏఎన్‌ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.

తాజావార్తలు


logo