బుధవారం 27 జనవరి 2021
Nirmal - Aug 14, 2020 , 00:17:21

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

నార్నూర్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సర్పంచ్‌ బానోత్‌ గజానంద్‌నాయక్‌ అన్నారు. పం చాయతీ కార్యాలయంలో పోలీస్‌, వైద్య ఆరోగ్య శాఖ, నాయకులతో గురువారం సమావేశం నిర్వహించారు. వైరస్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారు చర్చించారు. అనంతరం సర్పంచ్‌ మాట్లాడుతూ.. మండల కేంద్రంలో ఒకరికి పాజిటివ్‌ వచ్చిందని, అత్యవసర పనులుంటేనే  ప్రజలు బయటికి రావాలన్నారు. స్వాతం త్య్ర దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించుకోవాలని, పొలాల పండుగను ఆలయాల్లో రైతులు తమ ఎడ్లతో భౌతిక దూరం పాటిస్తూ పూజలు చేసుకోవాలన్నారు. అనంతరం ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ వైరస్‌ నివారణకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఉప సర్పంచ్‌ చౌహాన్‌ మహేందర్‌, వైద్య సిబ్బంది చౌహాన్‌ నాందేవ్‌, గ్రామ పెద్దలు బానోత్‌ జాలంసింగ్‌, ఆడే సురేశ్‌, రాథోడ్‌ ఉత్తం, మహేందర్‌ దుర్గే, షేక్‌ దాదే అలీ పాల్గొన్నారు.logo