ప్రజారోగ్యానికి ప్రాధాన్యం

- మున్సిపాలిటీల్లో జనాభా ప్రాతిపదికన పనులు
- n నిర్మల్, భైంసా, ఖానాపూర్‌లో పనులు వేగిరం
- n మూడు బల్దియాల్లో 84 టాయిలెట్ల నిర్మాణం
- n ఆగస్టు 15 నాటికి ప్రారంభానికి సిద్ధం
నిర్మల్ అర్బన్ : ప్రజారోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి సరైన మరుగుదొడ్లు అందుబాటులో లేవు. దీంతో పాటు ఆయా పట్టణాల్లో ఉన్న మరుగుదొడ్లు జనాభాకు సరిపోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విషయాన్ని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం పట్టణ జనాభాకు అనుగుణంగా జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో మరుగుదొడ్లు నిర్మించాలని యోచించింది. ఈ క్రమంలో అధికారులు నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన చౌరస్తాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయడంతో ప్రజలకు ఇబ్బందులు పూర్తిగా తొలగిపోనున్నాయి.
పట్టణ జనాభా ప్రాతిపదికన నిర్మాణం..
ప్రజారోగ్య పరిరక్షణకు నిర్మల్ జిల్లాలోని భైంసా, ఖానాఫూర్, నిర్మల్ మున్సిపాలిటీల్లో మరుగుదొడ్లను నిర్మిస్తున్నారు. పట్టణ జనాభా ప్రాతిపదికన చేపడుతున్నారు. ప్రతి మున్సిపాలిటీలో 1000 మంది జనాభాకు ఒక మరుగుదొడ్డిని నిర్మించాలనే లక్ష్యంగా పనులను వేగవంతం చేస్తున్నారు.
జిల్లాలో 270 మరుగుదొడ్ల నిర్మాణమే లక్ష్యం..
ప్రజారోగ్యం, పరిశుభ్రతలో భాగంగా జిల్లాలోని మున్సిపాలిటీల్లో జనాభా ప్రాతిపదికన మరుగుదొడ్లు నిర్మించనున్నారు. నిర్మల్ జిల్లాలో దాదాపు 270 మరుగుదొడ్ల నిర్మాణాలను చేపట్టాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. నిర్మల్ మున్సిపాలిటీలో దాదాపు లక్ష జనాభాకు 100 మరుగుదొడ్లు అవసరం ఉండగా.. ఇప్పటికే బస్టాండ్, పెట్రోల్ బంకులు, పబ్లిక్ టాయిలెట్స్, మార్కెట్ ఏరియా, ఇతర ప్రదేశాల్లో దాదాపు 54 మరుగుదొడ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంకా 46 మరుగుదొడ్లను నిర్మిస్తున్నారు. భైంసా మున్సిపాలిటీలో జనాభా ప్రాతిపదికగా 50 మరుగుదొడ్లు అవసరం ఉండగా.. ఇప్పటికే పట్టణంలోని పలు పబ్లిక్ ఏరియాల్లో 24 మరుగుదొడ్లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. మరో 26 నిర్మించనున్నారు. వీటి నిర్మాణాలు దాదాపు పూర్తి కావస్తున్నాయి. ఖానాపూర్ మున్సిపాలిటీలో పట్టణ జనాభాకు అనుగుణంగా 23 మరుగుదొడ్లు అవసరం ఉండగా, ఇప్పటికే 11 మరుగుదొడ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 12 మరుగుదొడ్లలో ఐదు పూర్తి కానుండగా, మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయి.
ఆగస్టు 15 నాటికి ప్రారంభానికి సిద్ధం..
జిల్లాలోని ఖానాపూర్, నిర్మల్, భైంసా మున్సిపాలిటీల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు ఇప్పటికే ప్రారంభం కాగా, పనులను ఉన్నతాధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి దాదాపు రూ.6-7 లక్షల వరకు ఖర్చు అవుతుండడంతో కొన్ని చోట్ల మున్సిపల్ నిధులతో మరుగుదొడ్లు నిర్మించగా, మరికొన్ని చోట్ల ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో(పీపీఈ) నిర్మించడంతో పనులు వేగంగా సాగుతున్నాయి. ఆగస్టు 15వ తేదీన మరుగుదొడ్లను అధికారులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయి..
నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో జనాభా ప్రాతిపదికన మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నాం. జిల్లా కేంద్రం కావడంతో పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వివిధ అవసరాల కోసం ప్రతిరోజూ పెద్దసంఖ్యలో వస్తుంటారు. వారిని దృష్టిలో ఉంచుకుని పట్టణంలోని ప్రధాన ఏరియాలతో పాటు జనసంచారం ఎక్కువగా ఉండేచోట, కార్యాలయాల సమీపంలో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపడుతున్నాం. పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.6-7 లక్షల వ్యయం అవుతుంది. పూర్తయిన మరుగుదొడ్లను త్వరలో ప్రారంభిస్తాం.
- గండ్రత్ ఈశ్వర్, మున్సిపల్ చైర్మన్, నిర్మల్
తాజావార్తలు
- ముఖ్యమంత్రికి కృతజ్ఞతలతో..
- ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం
- ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు
- కేటీఆర్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతారు
- సైదన్న జాతర సమాప్తం
- అవకాశమిస్తే.. కాదా! ఆకాశమే హద్దు
- సమన్వయంతో పని చేయాలి
- పాఠశాల పరిసరాలను శుభ్రం చేయాలి
- సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం
- తల్లీబిడ్డల సంక్షేమం కోసమే మాతా శిశు దవాఖాన