గురువారం 21 జనవరి 2021
Nirmal - Aug 13, 2020 , 01:54:44

స్వరాష్ట్రంలోనే అద్భుతమైన పథకాలు

స్వరాష్ట్రంలోనే అద్భుతమైన పథకాలు

నార్నూర్‌ : స్వరాష్ట్రంలోనే అద్భుతమైన పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్నారని ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌ అన్నారు. మండల కేంద్రంలోని ఈజీఎస్‌ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. దీనికి జడ్పీ చైర్మన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 30 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కనక మోతుబాయి, వైస్‌ ఎంపీపీ చంద్రశేఖర్‌, తహసీల్దార్‌ మహ్మద్‌ జాకీర్‌, ఎంపీటీసీలు టి.పరమేశ్వర్‌, అబితాఖానమ్‌, ఇంద్రవెల్లి మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ తొడసం నాగోరావ్‌, సహకార సంఘం వైస్‌ చైర్మన్‌ ఆడే సురేశ్‌,సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు యుర్వేత రూప్‌దేవ్‌,నాయకులు రాథోడ్‌ ఉత్తమ్‌, హైమద్‌, షేక్‌ దాదేఅలీ, కనక ప్రభాకర్‌, మెస్రం మానిక్‌రావ్‌, తదితరులు పాల్గొన్నారు.

సమస్యపరిష్కారానికి చర్యలు..

గిరిజనేతరుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌ అన్నారు. బుధవారం స్థానిక ఈజీఎస్‌ కార్యాలయంలో దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏజెన్సీ ప్రాంతంలో తాతముత్తాల కాలం నుంచి నివాసముం టూ, సాగు చేసే భూములకు పట్టాలు లేక కనీసం పహాణీలు ఇవ్వకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పొందలేకపోతున్నామని దళితులు మొరపెట్టుకున్నారు. పహాణీలు ఇప్పిస్తే బ్యాంకు రుణాలైన తీసుకునేందుకు వెసులుబాటు ఉంటుందని ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీచైర్మన్‌ను కలిసి తమకు శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకున్నారు. తప్పకుండా సమస్య కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి రెండు రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 


logo