ఆదివారం 24 జనవరి 2021
Nirmal - Aug 13, 2020 , 00:22:37

పంద్రాగస్టు అతిథులు వీరే..

పంద్రాగస్టు అతిథులు వీరే..

  • జెండావిష్కరణకు ముఖ్యులను ప్రకటించిన సర్కారు
  • నిర్మల్‌కు మంత్రి అల్లోల, ఆదిలాబాద్‌కు విప్‌ గంప గోవర్ధన్‌  

నిర్మల్‌, నమస్తే తెలంగాణ : పంద్రాగస్టు వేడుక ల సందర్భంగా ఉమ్మడి జిల్లా పరిధిలోని నాలుగు జిల్లాల కేంద్రాల్లో జెండా ఎగురవేసే అతిథుల పేర్లను ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఆది లాబాద్‌ జిల్లాకు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, నిర్మల్‌ వేడుకల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ విప్‌ బాల్క సుమ న్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా వేడుకల్లో ప్రభుత్వ విప్‌ అరెకపూడీ గాంధీ పాల్గొననున్నారు. కార్యక్రమంలో భాగంగా జెండా ఎగురవేసిన అనంతరం, ఆయా జిల్లాల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. 


logo