సోమవారం 28 సెప్టెంబర్ 2020
Nirmal - Aug 10, 2020 , 22:59:11

చేపల పండుగకు వేళాయె

చేపల పండుగకు వేళాయె

  • నేడు ఎస్సారెస్పీలోచేప పిల్లలు వదలనున్న మంత్రులు
  • సోన్‌ మండలం గాంధీనగర్‌ వద్ద కార్యక్రమం
  • జిల్లా కేంద్రంలోని సోఫినగర్‌ విజయ డెయిరీలో హరితహారం

నిర్మల్‌ టౌన్‌/సోన్‌ : మత్స్య కార్మికులకు జీవనోపాధి, ఆర్థిక భరోసా కల్పించేందుకు చేపల పండుగ మంగళవారం ప్రారంభం కానుంది. పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, అటవీ పర్యావర ణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి చేతుల మీదుగా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో చేప పిల్లలను వదలనున్నారు. 2020-21 సంవత్సరానికి గానూ నిర్మ ల్‌ జిల్లాలో 6 కోట్ల 6 లక్షల చేప పిల్లలను వదలాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వంద శాతం సబ్సిడీపై ప్రతి  యేటా చేప పిల్లల పెంపకాన్ని నిర్వహిస్తున్నారు. కడెం, గడ్డెన్న వాగు, స్వర్ణ, శ్రీరాంసాగర్‌, ప్రాజెక్టులతో పాటు, చెరువుల్లో మొదటగా చేప పిల్లలను పోయాలని అధికారులు నిర్ణయించారు. జిల్లావ్యాప్తంగా 721 చెరువులతో పాటు స్వర్ణ, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు, గడ్డెన్నవాగు, చిన్న సుద్దవాగు, తదితర ప్రాజెక్టుల్లో చేప పిల్లలను పెంచాలని అధికారులు నిర్ణయించారు. 

ఇందులో భాగంగా సోన్‌ మండలం గాంధీనగర్‌ గ్రామం వద్ద ఎస్సారెస్పీలో మొట్టమొదటిసారిగా చేప పిల్లలను వదలాలని ప్రభు త్వం నిర్ణయించింది. మంగళవారం ఉదయం పది గం టలకు మంత్రులు శ్రీనివాస్‌యాదవ్‌, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి చేప పిల్లలను వదలనున్నారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని సోఫినగర్‌ విజయ డెయిరీలో తెలంగాణ హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్‌ హాజరవుతున్నట్లు డీఆర్‌డీవో వెంకటే శ్వర్లు తెలిపారు. 


logo