బుధవారం 20 జనవరి 2021
Nirmal - Aug 10, 2020 , 00:08:24

‘రైతుల అభ్యున్నతికి టీఆర్‌ఎస్‌ కృషి’

‘రైతుల అభ్యున్నతికి టీఆర్‌ఎస్‌ కృషి’

కుభీర్‌ : రైతులను దోచుకునే సంస్కృతి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిది కాదని, వారి అభ్యున్నతికి ఎన్నో పథకాలను అమలు చేస్తూ అండగా నిలుస్తున్నదని కుభీర్‌ సహకార సంఘం చైర్మన్‌, మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర డైరెక్టర్‌ రేకుల గంగాచరణ్‌ అన్నారు. కుభీర్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి మాట్లాడారు. మక్కల రైతులకు రావాల్సిన డబ్బుల్లో కోత విధించారని, చైర్మన్‌ రూ.60 లక్షలు రైతుల డబ్బులను స్వాహా చేశారని అఖిలపక్షం నాయకులు రైతులతో కలిసి మార్క్‌ట్‌యార్డులో శనివారం నిరసన వ్యక్తం చేసి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. దీంతో పాటు కుభీర్‌ సొసైటీపై బురదజల్లే ఆరోపణలు చేశారన్నారు. కుభీర్‌ మండలంలో కొనుగోలు చేసిన సుమారు 85 వేల క్వింటాళ్ల మక్కలను లేబర్లు లేక జల్లెడ చేయలేకపోయామని, వర్షం కారణంగా కొనుగో లు కేంద్రాల్లో తడిసిన మక్కలకు నాణ్యత లోపించడంతో మార్క్‌ఫెడ్‌ 350 క్వింటాళ్ల తరుగు చూ పిందన్నారు. దీనికి గాను సుమారు రూ.6 లక్షలు కట్‌ చేశారని, ఇది ఇక్కడే కాదు.. రాష్ట్ర మంతటా జరిగిందన్నారు. కానీ చైర్మన్‌పై ఆరోపణలు చేయ డం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో రైతులకు తెలుసన్నారు. అసత్య ఆరోపణలు చేసిన వారి పై న్యాయ పోరాటం చేస్తామన్నారు. పరువునష్టం దావా వేస్తామని హె చ్చరించారు. సమావేశంలో వైస్‌ చైర్మన్‌ మెంచు రమేశ్‌, డైరెక్టర్లు లాలేశ్‌, దొంతుల లింగన్న, ముథోల్‌ భూమన్న, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. logo