కరోనా వేళ.. ఆగని అభివృద్ధి

నిర్మల్, నమస్తే తెలంగాణ:కరోనా వైరస్ వ్యాప్తితో ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ.. ఎప్పట్లాగే నిరంతరాయంగా ప్రజా సంక్షేమ పథకాలతోపాటు అభివృద్ధికి తెలంగాణ సర్కారు పెద్దపీట వేస్తున్నది. అన్ని రంగాలు, వ్యవస్థలు, వ్యాపారాలు, వృత్తులు కోలుకోలేని దెబ్బతినగా.. సర్కారు మాత్రం పాత పథకాలతోపాటు కొత్త పథకాలు, పనులు చేపడుతున్నది. పల్లెల్లో సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయి.
కాలువ నిండా నీళ్లస్తున్నయ్
దండేపల్లి : నాకు మా ఊరిలో రెండెకరాల సాగు భూమి ఉంది. సర్కారోళ్లు జలహితం పేరిట కాలువలు బాగు చేయించారు. ఉపాధి పనుల కింద కాలువల్లో పూడికతీశారు. పిచ్చి మొక్కలు తొలగించారు. ఇప్పుడు కాలువ నిండా నీళ్లస్తున్నయ్. ఆఖరుకు ఉన్న పొలాలు కూడా పారుతున్నయ్. ఇది వరకు పట్టించుకున్నోళ్లు లేరు. రైతులందరం కలిసి రెండు మూడు రోజులు కష్టపడి కాలువను మంచిగ చేసుకునేటోళ్లం. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంటోళ్లు మా బాధలను పట్టించుకున్నందుకు ఆనందంగా ఉంది. ఎలాంటి రంది లేకుంటైంది. మంచిగ నీళ్లు వస్తున్నయ్.
-పేరం బాపు, రైతు, తాళ్లపేట,దండేపల్లి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 89 చోట్ల ప్రాజెక్టులు, చెరువుల కింద కాలువల్లో పూడికతీత మట్టి, పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు తొలగించేందుకు ప్రభుత్వం జలహితలో భాగంగా పనులు చేపట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 87 పనులకు రూ.4.77 కోట్లు మంజూరు చేసి 1,98,631 మంది కూలీలకు ఉపాధి చూపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 19 చోట్ల పనులు చేస్తుండగా రూ.60.71 లక్షలు వెచ్చించి.. 33,041 మందికి ఉపాధి చూపారు. ఆదిలాబాద్ జిల్లాలో 19 పనులకు రూ.58.39 లక్షలు కేటాయించగా.. మూడు పనులకు రూ.12.95 లక్షలు, ఆసిఫాబాద్ జిల్లాలో ఎనిమిది పనులకు రూ.62.95 లక్షలు కేటాయించగా.. మూడు పనులకు రూ.8.03 లక్షలు వెచ్చించారు. నిర్మల్ జిల్లాలో 21 పనులకు రూ.1.27 కోట్లు కేటాయించగా.. రెండు పనులకు రూ.13.85 లక్షలు ఖర్చు చేశారు. మంచిర్యాల జిల్లాలో 39 పనులకు రూ.2.29 కోట్లు మంజూరు చేయగా.. 11 పనులకు రూ.25.88 లక్షలు వెచ్చించారు.
రైతువేదికలతో పనులు చక్కబెట్టుకోవచ్చు..
మాది దండేపల్లి మండలంలోని కాసిపేట. మాకు ద్వారకలో రైతు వేదిక నిర్మించి ఇస్తున్నరు. ఈ భవనం కడితే రైతులందరూ ఒకే చోట చేరి వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు పాటించే అవకాశం ఉంటుంది.దీంతో పంట సాగులో మరిన్ని మార్పు లు వచ్చి ఎవుసం లాభసాటిగా మారే అవకాశాలు ఉన్నా యి. రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు, సమయానికి ఎరువులు అందిస్తూ సర్కారు అండగా నిలుస్తున్నది. ఇప్పుడు రైతు వేదిక నిర్మిస్తూ రైతాంగానికి దగ్గరవుతున్నది. రైతుల మేలు కోరి పండించిన పంటలకు మద్దతు ధర అందిస్తూ.. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ధాన్యం ఆరబెట్టుకోవడానికి కల్లాలను నిర్మిస్తున్నరు. రైతుల పాలిట సీఎం కేసీఆర్ దేవుడే. మేమంతా ముఖ్యమంత్రి సారుకు జీవితాంతం రుణపడి ఉంటం.
-కొడపర్తి సత్యం, కాసిపేట(దండేపల్లి)
తాజావార్తలు
- దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తొలి వ్యక్తి ఇతనే.. వీడియో
- తెలుగు మహాకవి గురజాడను గుర్తు చేసిన మోదీ
- రాష్ర్టంలో కరోనా టీకా తీసుకున్న తొలి వ్యక్తి ఈమెనే..
- చనిపోయిన పెంపుడు శునకానికి ఎంత గొప్ప సంస్కారం..!
- రష్యా ఎస్-400 మిస్సైల్ కొనుగోళ్లపై అభ్యంతరం
- లాక్డౌన్తో ప్రాణాలను కాపాడుకున్నాం : ప్రధాని మోదీ
- తెలంగాణలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం
- కరోనా ఖతం.. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ ప్రారంభించిన మోదీ
- దేశంలో కొత్తగా 15,158 పాజిటివ్ కేసులు
- రాష్ర్టంలో కొత్తగా 249 కరోనా కేసులు