గురువారం 29 అక్టోబర్ 2020
Nirmal - Aug 09, 2020 , 01:46:10

నవరాత్రులు నిరాడంబరంగా జరుపుకోవాలి

నవరాత్రులు నిరాడంబరంగా జరుపుకోవాలి

నిర్మల్‌ అర్బన్‌ :  గణేశ్‌ నవరాత్రులను  నిరాడంబరంగా నిర్వహించు    కోవాలని నిర్మల్‌ డీఎస్పీ ఉపేందర్‌ రెడ్డి సూచించారు. జిల్లాకేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌లో గణేశ్‌ మండలి నిర్వాహకులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ కొవిడ్‌-19 నిబంధనలు  పాటించాలన్నారు. ప్రధాన కూడళ్లలోని మండపాల్లో భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్నారు. పరిసరాలను నిత్యం శానిటైజేషన్‌ చేయించాలని, తక్కువ మందితో నిమజ్జనం జరి గేలా చూడాలన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐ జాన్‌ దివాకర్‌, మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.

నిర్మల్‌ అర్బన్‌ : పట్టణంలో సంపూర్ణ లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలని మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌ అన్నారు. నిర్మల్‌ మున్సిపల్‌ కార్యాలయంలో ఆల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అసోసియేషన్‌ సభ్యులు స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు పిలుపునివ్వడం అభినందనీయమన్నారు. సోమవారం వరకు దుకాణాలు తెరిచి ఉంటాయని, మంగళవారం నుంచి వచ్చే ఆదివారం వరకు పూర్తిగా మూసి ఉంటాయన్నారు.  సమావేశంలో కిరాణా, వెండి, బంగారం, వస్త్ర,  స్టీల్‌, రాజస్థాన్‌ సమాజ్‌ అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.