పత్తిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి

తాంసి : రైతులు వానకాలంలో వేసిన పత్తి పంటలో వచ్చే వివిధ రకాల చీడపీడలను నివారించేందుకు అవసరమైన సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయాధికారి వెంకటి సూచించారు. మండలంలోని గిరిగాం, లింగూడలో రైతులకు లింగాకర్షక బుట్టలు, నిమాయిల్, బొట్టుపెట్టే పద్ధతికి సంబంధించిన స్టిక్స్‌ను శుక్రవారం పంపిణీ చేశారు. ప్రస్తుతం పత్తి పంట వేసి 60 రోజులు కావస్తోందని, ఈ దశలో మొక్కలను గులాబీరంగు, రసం పీల్చే పురుగు ఆశించే అవకాశం ఉందన్నారు. వీటి దాడి నుంచి పత్తి పంటను కాపాడుకునేందుకు రైతులు నిమాయిల్ను పిచికారీ చేయాలని సూచించారు. ఎకరం పత్తి పంటలో 10 నుంచి 15 వరకు లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మొక్క చివరలో బొట్టుపెట్టే పద్ధతి ద్వారా కూడా చీడపీడలను నివారించవచ్చని తెలిపారు. ఇప్పటి వరకు రైతుబీమా చేయించుకోని రైతులు సంబంధిత దరఖాస్తులు పూర్తి చేసి ఏఈవోలకు అందజేయాలన్నారు. కొత్తగా పాసుపుస్తకాలు వచ్చిన రైతులు కూడా రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ జిల్లా నోడల్ అధికారి కాండ్లి శివకుమార్, వ్యవసాయ పరిశోధన స్థానం కీటక శాస్త్రవేత్త రాజశేఖర్, ఎన్ఎఫ్ఎస్ఎం జిల్లా ఇన్చార్జి నర్సింగ్, ఏవో రవీందర్, సర్పంచ్‌లు గజానంద్, శంకర్, ఏఈవో యోగిరాజ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఇండియన్లపై వాట్సాప్ నిర్ణయం ఏకపక్షం: కేంద్రం
- కంటి ఆరోగ్యానికి కావాల్సిన విటమిన్లు తెలుసా..?
- శ్రద్దాదాస్ సొగసు చూడతరమా
- ఇంటికైనా మట్టికైనా మనోడే ఉండాలి
- రేపటి ర్యాలీకి సిద్ధమైన రైతుల ట్రాక్టర్లు
- బాలికపై బ్యాంకు మేనేజర్ అత్యాచారం..!
- ఎర్ర బంగారంతో ఎరుపెక్కిన ఖమ్మం మార్కెట్
- ఆలయాల అభివృద్ధికి భారీగా నిధులు : మంత్రి హరీశ్ రావు
- ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ తుది పోరు వాయిదా
- ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణకు కేంద్రం సమాలోచన!