బుధవారం 20 జనవరి 2021
Nirmal - Aug 08, 2020 , 03:09:03

సదాశివ మాస్టారు.. సాహితీ రత్నం

సదాశివ మాస్టారు.. సాహితీ రత్నం

ఎదులాపురం : ఆదిలాబాద్‌ సహా రాష్ట్ర ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన సాహితీ రత్నం.. సామల సదాశివ మాస్టారు భౌతికంగా లేకపోయినా సదా స్మరణీయుడేనని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. పట్టణంలోని కొండాలక్ష్మణ్‌ బాపూజీ చౌక్‌లో శుక్రవారం సదాశివ మాస్టారు 9వ వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే.. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎం ప్రహ్లాద్‌, సదాశివ కుటుంబ సభ్యులు, పద్మశాలీ సం ఘ సభ్యులతో కలిసి మాస్టారు చిత్రపటానికి పూలమాలలు వే సి, నివాళులర్పించారు. అంతకుముందు కొండా లక్ష్మణ్‌ బాపూ జీ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం చేనేత కార్మికులను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ.. ఉద్యమకాలంలో సీఎం కేసీఆర్‌ ఆదిలాబాద్‌కు వచ్చినప్పుడు సదాశివ మాస్టారును కలిసి, పుష్పగుచ్ఛం అందజేశార ని, అలాగే ఆయనను తన గురువుగా ప్రస్తావించారని గుర్తుచేశారు. మాస్టారు స్మారకంగా అవార్డుల ప్రదానం విషయమై ప్ర భుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఆయన స్ఫూర్తితో జిల్లా కవులు, రచయితలు సమాజహిత రచనలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, కవి, రచయిత సామల రాజవర్ధన్‌, పద్మశాలీ సంఘ నాయకులు ఎం ఆశమ్మ, బేత రమేశ్‌ పాల్గొన్నారు.

చాంద(టి)కి 100 డబుల్‌ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తాం..

ఆదిలాబాద్‌ రూరల్‌ : మండలంలోని చాంద(టి) గ్రామ పంచాయతీకి రెండు దఫాలుగా 100 డబుల్‌ బెడ్రూం ఇండ్లు మంజూరుచేస్తామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. చాంద(టి)లో పల్లె ప్రకృతి వనం నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. మహనీయులు చెప్పిన నానుడిలనే నేడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పథకాల ద్వారా అమలు చేసి చూపిస్తున్నారన్నారు. పల్లెలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. పల్లె ప్రజలకు ఆహ్లాదం, ప్రాణవాయువును అందించే ఉద్దేశంతో ప్రకృతి వనాలు ఏర్పా టు చేస్తున్నట్లు చెప్పారు. ఆరో విడుత హరితహారంలో భాగంగా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటుతున్నామని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి చాంద(టి) గ్రామంలో జరగని అభివృద్ధిని ఈ ఆరున్నరేళ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసి చూపించిందని గుర్తుచేశారు. ఇంకా ఎన్ని నిధులైనా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మెట్టు ప్రహ్లాద్‌, సర్పంచ్‌ భాస్కర్‌, డీఆర్డీవో రాజేశ్వర్‌ రాథోడ్‌, తహసీల్దార్‌ మోహన్‌సింగ్‌, ఎంపీడీవో భూక్యా శివలాల్‌, ఎంపీవో ఆనంద్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ వీరేస్‌, ఏపీవో మేఘమాల పాల్గొన్నారు.


logo