మంగళవారం 19 జనవరి 2021
Nirmal - Aug 08, 2020 , 03:09:14

అన్ని విధాలా ఆదుకుంటాం..

అన్ని విధాలా ఆదుకుంటాం..

నిర్మల్‌ అర్బన్‌ : ‘ఆత్మ నిర్భర్‌ అభియాన్‌' కింద రుణాలు ఇచ్చి చిరు వ్యాపారులను అన్ని విధాలా ఆదుకుంటామని నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ అన్నారు. నిర్మల్‌ పట్టణంలోని వీధి వ్యాపారులను శుక్రవారం కలిసి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దరఖాస్తు చేసుకున్న ప్రతి వ్యా పారికి రూ.10 వేల రుణం అందజేస్తామన్నారు. ఆయన వెంట మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, కమిషనర్‌ ఎన్‌ బాలకృష్ణ, ఐకేపీ సిబ్బంది శ్రీనివాస్‌, సావి త్రి, రవీందర్‌, శివకుమార్‌ పాల్గొన్నారు.

జాతీయ జెండా పనుల పరిశీలన..

జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్‌ బండ్‌ వద్ద నిర్మించనున్న 150 అడుగుల జాతీయ జెండా నిర్మాణ పనులను మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌తో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. ఆగస్టు 15వ తేదీ లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్ర జల్లో దేశభక్తిని పెంపొందించాలన్న ఉద్దేశంతో జాతీయ జెండాను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పట్టణమంతా కనిపించేలా 150 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 

లక్ష్యం మేరకు రుణాలివ్వాలి..

నిర్మల్‌ టౌన్‌ : జిల్లాలో చిన్న, మధ్యతరహా, సూక్ష్మ పరిశ్రమల శాఖకు నిర్దేశించిన లక్ష్యం మేరకు రుణాలను అందించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలో వివిధ బ్యాంకర్లతో రుణ ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. కరోనా నేపథ్యంలో యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంపొందించాలన్న ఉద్దేశంతో పరిశ్రమల స్థాపనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయన్నారు. ముద్ర రుణాలతో పాటు మహిళా సంఘాలు, రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా సబ్సిడీపై రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ హరికృష్ణ, డీఆర్డీవో వెంకటేశ్వర్లు, జిల్లా పశు వైద్యాధికారి రమేశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.