లక్ష్యం మేరకు మొక్కలు నాటాలి

- n సంరక్షణకు చర్యలు తీసుకోవాలి
- n విజయవంతం చేయాలి
- n వీసీలో రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
నిర్మల్ టౌన్/ఎదులాపురం : ఆరో విడుత హరితహారంలో భాగంగా లక్ష్యం మేరకు మొక్క లు నాటి, సంరక్షించాలని అధికారులను రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి గురువారం ఆయా జిల్లాల కలెక్టర్లు, అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖలు, ము న్సిపల్ అధికారులతో ‘హరితహారం’పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 27 శాతం ఉన్న అడవులను 33 శాతానికి పెంచాలనే లక్ష్యంతో హరితహారం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమం ప్రాధాన్యతను గుర్తించి ప్రతి ఒక్క రూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఐదు విడుతల్లో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి, సంరక్షించినట్లు తెలిపారు. గ్రామాలు, పట్టణాలు పచ్చదనంతో కనిపిస్తున్నాయన్నారు. అన్ని జిల్లాల్లో నిర్దేశించిన లక్ష్యం మేరకు అన్ని శాఖలు మొక్క లు నాటి, సంరక్షించాలని సూచించారు. గ్రామా ల్లో హరితవనాలను వెంటనే ప్రారంభించి, మొ క్కలు నాటాలన్నారు. గతంలో మొక్కలు ఎండిపోయిన చోట కొత్తగా నాటాలని సూచించారు. సంరక్షణకు ప్రత్యేక అధికారులను నియమించి, పర్యవేక్షించాలని కోరారు. అటవీశాఖ ముఖ్య కా ర్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ.. లక్ష్యంలో వెనుకబడ్డ జిల్లాల్లో ప్రణాళికాబద్ధంగా మొక్కలు నాటి, సంరక్షించాలని సూచించారు. నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ మాట్లాడుతూ.. జి ల్లాలో ఇప్పటికే 50 శాతం మొక్కలు నాటినట్లు వెల్లడించారు. వర్షాలు కురిసిన వెంటనే లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. జిల్లాలో 50,34, 400 మొక్కల లక్ష్యంగా కాగా, 31,79,800 నాటినట్లు వెల్లడించారు. పల్లెల్లో ప్రకృతి వనాల ఏర్పాటుకు స్థలాలను గుర్తించినట్లు చెప్పారు. సమావేశంలో ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ ఎం డేవిడ్, డీఎఫ్‌వోలు సుదన్, ప్రభాకర్, డీఆర్డీవో లు వెంకటేశ్వర్లు, రాజేశ్వర్ రాథోడ్, జడ్పీసీఈవో కిషన్, డీపీవో శ్రీనివాస్, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రాజు, అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఎవరిని వదిలేది లేదంటున్న డేవిడ్ వార్నర్
- 15 నిమిషాల్లో దోపిడీ చేసి.. 15 గంటల్లో పట్టుబడ్డారు
- అంటార్కిటికా దీవుల్లో భూకంపం..
- డ్రైవరన్నా.. సలాం!
- ఓటీటీలో అడుగుపెట్టబోతున్న మాస్టర్
- ఎర్రలైటు పడితే ఆగాలి.. గ్రీన్ పడ్డాకే కదలాలి
- కోపంతో కాదు ప్రేమతోనే..
- వివాదం పరిష్కారమే ఎజెండాగా.. నేడు చైనాతో భారత్ చర్చలు
- సరికొత్తగా.. సాగర తీరం
- దుబాయ్‌లో ఘనంగా నమ్రత బర్త్‌డే సెలబ్రేషన్స్ .. పిక్స్ వైరల్