ఆదివారం 17 జనవరి 2021
Nirmal - Aug 05, 2020 , 01:58:45

తీజ్‌.. షురూ..

తీజ్‌.. షురూ..

బంజారా గూడేల్లో తీజ్‌ సందడి మొదలైంది. తొమ్మిది రోజులపాటు.. ఈ ఉత్సవం సాగనున్నది. బోథ్‌ మండలం రఘునాథ్‌పూర్‌, దన్నూర్‌ (కే), నిగిని, కంటెగాం, పార్డి (బీ) తదితర తండాల్లో.. రాఖీ పౌర్ణమి రోజున సాయంత్రం పుట్టమన్నులో గోధుమలు అలకడంతో కార్యక్రమం ప్రారంభమైంది. కాగా, కృష్ణాష్టమి వరకు యువతులు ఆడిపాడనున్నారు. ఆ తరువాత వాగుల్లో నిమజ్జనం చేస్తారు. మంగళవారం తండాల్లోని నాయకుల ఇళ్ల ఎదుట యువతులు, బాలికలు.. గోధుమలను అలికిన బుట్టలు ఉంచి పూజలు చేశారు. సమీప వాగులు, కుంటల నుంచి నీటిని తెచ్చి, బుట్టల్లో చల్లారు. ఇలా.. నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సంప్రదాయం ప్రకారం యువకులు అడ్డగించి.. పొడుపుకథలు విప్పాలని పట్టుబడుతారు.                                   - బోథ్‌