గురువారం 28 జనవరి 2021
Nirmal - Aug 05, 2020 , 01:58:53

పెద్ద పులి కోసం అన్వేషణ

పెద్ద పులి కోసం అన్వేషణ

  • n సీసీ కెమెరాల పరిశీలన
  • n ఆచూకీ లభించలేదని ఎఫ్‌బీవో కేశవ్‌ వెల్లడి

భీంపూర్‌ : మండలంలోని తాంసి(కె), గొల్లగడ్‌ శివారులో పెద్ద పులి ఆచూకీ కోసం అటవీ అధికారులు అన్వేషిస్తున్నారు. ఈ ప్రాంతంలో వారంరోజులుగా పులి సంచరిస్తున్న విషయం తెలిసిందే. కాగా, పాదముద్రలు లభ్యమైన పంట చేలలో సీసీ, నైట్‌ విజన్‌ కెమెరాలను అమర్చారు. వాటిని మంగళవారం ఎఫ్‌బీవో కేశవ్‌, బేస్‌ క్యాంప్‌ సిబ్బంది పరిశీలించారు. కెమెరాల్లో పులి కదలికలు చిక్కలేదని ఎఫ్‌బీవో వెల్లడించారు. కాగా, ఇక్కడి ప్రజలకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. రైతులు, కూలీలు జాగ్రత్తలు తీసుకుంటూ పనులు చేసుకోవాలని సూచించారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పులి గురించిన సమాచారం తెలుసుకుంటున్నారు.


logo