మంగళవారం 19 జనవరి 2021
Nirmal - Aug 05, 2020 , 01:58:54

వేదికలు వేగవంతం చేయాలి

వేదికలు వేగవంతం చేయాలి

  • ఆదిలాబాద్‌ అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి
  • కప్పర్లలో రైతు వేదిక, పల్లె ప్రకృతి వనాల నిర్మాణ పనుల పరిశీలన

తాంసి : రైతు వేదికల నిర్మాణాన్ని వేగవంతం చేసి, దసరాకు ముందే పూర్తిచేయాలని అధికారులను ఆదిలాబాద్‌ అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి ఆదేశించారు. మండలంలోని కప్పర్లలో రైతు వేది క, పల్లె ప్రకృతి వనాల పనులను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడారు. రైతుల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం వేదికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నదని పేర్కొన్నారు. పనుల్లో వేగం పెంచాలన్నారు. ఇందుకు కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పడు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని అధికారులకు సూచించారు. అలాగే ప్రతి గ్రామంలో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలన్న ఉద్దేశంతో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వాటి పనులను కూడా త్వరగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ సురుకుంటి శ్రీధర్‌రెడ్డి, ఎంపీడీవో ఆకుల భూమయ్య, తహసీల్దార్‌ సంధ్యారాణి, సర్పంచ్‌లు కేమ సదానందం, వెంకన్న పాల్గొన్నారు.