అడవుల సంరక్షణకు కృషి చేయాలి

- n నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
- n కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పర్యటన
- n గడ్డి మైదానాలు, ప్లాంటేషన్, బేస్ క్యాంపుల సందర్శన
పెంబి : వన్యప్రాణులు, అడవుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ పిలుపునిచ్చారు. మండలంలోని కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్‌లో సోమవారం డీఎఫ్‌వో సుతాన్తో కలిసి పర్యటించారు. రాగిదుబ్బనాల బేస్ క్యాంప్, తాటిగూడలోని బీట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సెక్షన్, బీట్ ఆఫీసర్ల బేస్ క్యాంప్‌ను సందర్శించారు. పెంబి నుంచి 25 కిలోమీటర్లు అటవీ ప్రాంతం గుండా పర్యటించి, ఫారెస్ట్ డెవలప్మెంట్ విషయాల గురించి తెలుసుకున్నారు. అడవిలోని ఎస్ఎంసీ వర్క్స్, గడ్డిమైదానాలు, అడవిలో సాగుచేస్తున్న పండ్ల తోటలను పరిశీలించారు. కలప స్మగ్లింగ్, అటవీ జంతువుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలపై వివరాలు తెలుసుకున్నారు. కవ్వాల్ అటవీ ప్రాంతంలో అధికారులు చేపడుతున్న అభివృద్ధి పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. దట్టమైన అటవీ అందాలను తిలకిస్తూ.. కలెక్టర్ మంత్రముగ్ధులయ్యారు. స్మగ్లర్లు, వేటగాళ్లపై ప్రత్యేక నిఘా పెంచాలని సూచించారు. అనంతరం తాటిగూడ బేస్‌క్యాంప్‌లో ఫారెస్ట్ సిబ్బంది ఏర్పాటు చేసిన తేనేటివిందు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కలీం, ఎఫ్ఆర్వో రామకృష్ణ, ఎస్ఐ రాజేశ్, ఎఫ్‌ఎస్‌వోలు రవీందర్, అటవీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- హెచ్1-బీ వీసా.. కొత్త వేతన నిబంధనల అమలు వాయిదా
- 20 నిమిషాలు..కోటి రెమ్యునరేషన్..!
- ప్రజలను రెచ్చగొట్టే టీవీ ప్రోగ్రామ్‌లను ఆపేయండి..
- ‘టాయ్ ట్రైన్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్’
- అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా మమతా తీర్మానం
- త్వరలోనే నిరుద్యోగ భృతి : మంత్రి కేటీఆర్
- నిమ్మగడ్డ బెదిరింపులకు భయపడేది లేదు: మంత్రి పెద్దిరెడ్డి
- దేశంలో 165కు చేరిన కొత్త రకం కరోనా కేసులు
- 2021 మెగా ఫెస్టివల్..ఈ ఏడాది 14 సినిమాలు..!
- హైవేపై ఎస్యూవీ నడిపిన ఐదేళ్ల చిన్నారి