బుధవారం 21 అక్టోబర్ 2020
Nirmal - Aug 04, 2020 , 02:33:12

వినండహో..

వినండహో..

  •  n పల్లెలో  ఇప్పటికీ సమాచార సాధనంగా   డప్పు చాటింపు
  •  n హైటెక్‌ యుగంలోనూ తగ్గని ఆదరణ
  •  n పండుగలైనా, పబ్బాలైనా..   తెలియాల్సింది దరువుతోనే.. 

 ‘ రేపు మన ఊళ్లో  హనుమాండ్ల గుడి వద్ద వీడీసీ మీటింగ్‌ పెడుతుండ్రు.. పాత లెక్కలు చెప్తా రంట.. కొత్త బాడీని ఎన్నుకుంటరట.. అందరూ రావాలయ్యో..’ అంటూ ఇచ్చోడ మండలం కోకస్‌మన్నూర్‌ ఊర్లో వాగ్మారే గణేశ్‌ డప్పు చాటింపు చేయగా, ఇండ్లలోని జనమంతా బయటకు వచ్చి ఏమిటని అడిగి తెలుసుకున్నా రు. ఇది ఒక్క కోకస్‌మన్నూర్‌ గ్రామంలోనే కాదు. చాలా పల్లెల్లో నేటికి ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. హైటెక్‌ యుగంలోనూ  డప్పు చా టింపునకు ఏ మాత్రం ఆదరణ తగ్గడం లేదు. -ఇచ్చోడ

పూర్వకాలం నుంచి..

పూర్వకాలం నుంచే పల్లెల్లో డప్పు చాటింపు సమాచార సాధనంగా ఉపయోగపడుతున్నది. ప్రస్తుతం రోజులు మారాయి. టెక్నాలజీ వచ్చింది. ప్రతి ఒక్కరికీ సెల్‌ఫోన్‌, ఇంటింటికీ టీవీలు ఉన్నాయి. చిన్నారులు మొదలు యువతీ, యువకులు పెద్దల వరకు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా చా టింగ్‌ చేసుకుంటున్నారు. గుడ్‌మార్నింగ్‌, గుడ్‌నైట్‌ అంటూ మెస్సేజ్‌లు పంపుకుంటున్నారు. అయినప్పటికీ నేటికి పల్లెల్లో సమాచార వారధిగా డప్పు చాటింపు కొనసాగుతుండడం ప్ర త్యేకతగా చెప్పుకోవచ్చు. వీడీసీ సమావేశాలే కాకుండా పండుగుల సమాచారం, గ్రామాల్లోకి  అధికారులు వచ్చేది, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, జాతరలు, ఇంటి, నల్లా పన్నులు, కరెంట్‌ బిల్లుల చెల్లింపు తదితర అంశాలకు సంబంధించి.. ఇలా ప్రతి సమాచారం చాటింపు ద్వారానే ప్రజలకు చేరవేస్తున్నారు. 

పొద్దున, రాత్రి  చాటింపు...

గ్రామంలో ఏ విషయమైనా పొద్దున, రాత్రి డప్పు చాటింపు ద్వారా సమాచారం చేరవేస్తారు. రైతులు ఉదయాన్నే పొలం బాట పడుతారు. సాయంత్రం ఇంటికి వస్తారు. వారికి సమాచారం అందకపోవచ్చనే ఉద్దేశంతో రాత్రిపూట కూడా చా టింపు చేయిస్తారు. కొన్ని పండుగలను ఎప్పుడూ నిర్వహిం చాలన్నది స్పష్టత ఉండదు. అప్పుడు ఊరిపెద్దలు, వీడీసీ సభ్యు లు కలిసి నిర్ణయం తీసుకొని చాటింపు ద్వారా ప్రజలకు తెలియజేస్తారు. 

అరకొర భత్యమే...

డప్పు చాటింపు వేసే వారికి మాత్రం భత్యం అరకొరగా ఇస్తున్నారు. పల్లెల్లో రూ. 200, పెద్ద గ్రామ పంచాయతీల్లో రూ. 300 దాకా చెల్లిస్తున్నారు.  అయితే పంచాయతీ అధికారులు, వీడీసీ సభ్యులు నెలనెలా కొంత వేతనం నిర్దేశించి అందిస్తే బాగుంటుందని  వారు కోరుతున్నారు. పురాతన కాలం నుంచి వస్తున్న అనవాయితీ నేటికి చెక్కు చెదరకుండా కొనసాగుతుండడం హర్షించదగ్గ విషయమని పలువురు పేర్కొంటున్నారు. 

పదేళ్లుగా చాటింపు చేస్తున్నా..

నేను పదేళ్ల నుంచి డప్పు చాటింపు చేస్తున్నా. సర్పంచ్‌, వీడీసీ, గ్రామ పెద్దలు ఏ పని చెప్పినా డప్పు కొడు తూ ఊరంతా తిరుగుతూ  సమా చారం చేరవేస్తా. రూ. 200 కైకిల్‌ ఇస్తారు. సర్పంచ్‌, వీడీసీ పెద్దలు కలి సి నెలనెలా కొంత జీతం లెక్క ఇస్తే బాగుంటుంది.

-వాగ్మారే గణేశ్‌, కోకస్‌మన్నూర్‌


logo