సోమవారం 25 జనవరి 2021
Nirmal - Aug 02, 2020 , 23:57:39

భారీ వర్షం ఉప్పొంగిన వాగులు

భారీ వర్షం  ఉప్పొంగిన వాగులు

బోథ్‌: మండలంలోని అందూర్‌ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం భా రీ వర్షం కురిసింది. రెండు గంటల పాటు పడడంతో వాగులన్నీ ఉప్పొంగి ప్రవహించాయి. జనజీవనం స్తంభించిం ది. రాకపోకలు నిలిచిపోయాయి. పొలా ల్లో నీరు నిలిచింది. నారాయణ్‌పూర్‌, అందూర్‌, రఘునాథ్‌పూర్‌ అటవీ ప్రాం తాల్లో కురిసిన భారీ వర్షంతో అందూర్‌, మందబొగుడ, ధన్నూర్‌ (కే) వాగులు ఉప్పొంగాయి. మందబొగుడ వద్ద వం తెన లేకపోవడంతో గ్రామంతోపాటు కుచ్చిరాలతండాకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగు దాటి పొలాలకు వెళ్లి న ఖండిపల్లె, అందూర్‌ గ్రామాల రైతు లు చిక్కుకుపోయారు. అందూర్‌ వద్ద లోలెవల్‌ కాజ్‌వే పైనుంచి నీరు ప్రవహించడంతో గ్రామంతోపాటు నారాయణ్‌పూర్‌ గ్రామాలకు రాకపోకలు నిలి చి పోయాయి. వాగు పరీవాహక ప్రాం తాల్లోని పొలాల్లో నీరు నిలవడంతోపాటు మట్టి మేటలు వేయడంతో పత్తి, సో యా, కంది పంటలకు నష్టం వాటిల్లే ప్ర మాదం ఏర్పడిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 

కుభీర్‌: పత్తి, సోయా పంటలను వ రుణుడు ఆదుకున్నాడు. ఆదివారం కురిసిన వర్షంతో వాగులు, వంకలు, చెరువులు, కుంటల్లో ఇప్పటి వరకు నీరు లేక వెలవెల బోగా ప్రస్తుతం నీటితో కళకళ లాడుతున్నాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


logo