సోమవారం 28 సెప్టెంబర్ 2020
Nirmal - Aug 02, 2020 , 01:38:07

సమస్యలు పరిష్కరిస్తా..

సమస్యలు పరిష్కరిస్తా..

ఇంద్రవెల్లి: గ్రామాల్లో సమస్యలుంటే తన దృష్టికి తెస్తే పరిష్కరిస్తానని ఆదిలాబాద్‌ కలెక్ట ర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. కెస్లాపూర్‌ నాగో బా ఆలయాన్ని శనివారం ఆమె సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సర్పంచ్‌ మెస్రం రేణుకతోపాటు మెస్రం పెద్దలు కలెక్టర్‌ను సన్మానించారు. మండలంలోని పాటగూ డ గ్రామంలో దాదాపు 25 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని అందులో ఏకలవ్య పాఠశాలను నిర్మించాలని కోరుతూ ఆదివాసీ గిరిజన పెద్దలు కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌కు వినతిపత్రం అందించారు. ఏకలవ్య పాఠశాల నిర్మాణ స్థలం గురించి ఐటీడీఏ పీవోతో చర్చించి నిర్ణ యం తీసుకుంటామని హామీ ఇచ్చారు. నాగోబాను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నా రు. జడ్పీటీసీ ఆర్క పుష్పలత, ఎంపీటీసీ మ డావి భీమ్‌రావ్‌, తహసీల్దార్‌ రాఘవేంద్రరా వ్‌, ఎంపీడీవో రమాకాంత్‌, ఆర్‌ఐ మెస్రం లక్ష్మణ్‌, వీఆర్వో అనసూయ, ఆదివాసీ గిరిజన పెద్దలు సిడాం భీమ్‌రావ్‌, మెస్రం వెంకట్‌రావ్‌ పటేల్‌, నాగ్‌నాథ్‌, ఆనంద్‌రావ్‌, షేక్‌, కోట్నాక్‌ బారిక్‌రావ్‌, తొడసం నాగోరావ్‌, ఆర్క కమ్ము, తదితరులు పాల్గొన్నారు.

కుంటాలలో సందడి..

నేరడిగొండ: ప్రముఖ పర్యాటక ప్రాం తంగా గుర్తింపు పొందిన కుంటాల జలపాతాన్ని ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. జలపాతం అందాలు, చుట్టూ చెట్లు, పరిసరాలను చూసి ఆనందం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి సెల్ఫీ దిగారు. 


logo