బుధవారం 05 ఆగస్టు 2020
Nirmal - Aug 01, 2020 , 00:55:18

విధులను బాధ్యతగా నిర్వహించాలి

విధులను బాధ్యతగా నిర్వహించాలి

నిర్మల్‌ అర్బన్‌  : విధులను బాధ్యతగా నిర్వహించాలని మున్సిపల్‌ కార్యాలయ ఉద్యోగులు, సిబ్బందిని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి ఆదేశించారు. కౌన్సిల్‌ సమావేశం అనంతరం మున్సిపల్‌ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో అన్ని విభాగాలను  పరిశీలించారు. మున్సిపల్‌ సిబ్బంది పేర్లు, విధులు నిర్వహించే శాఖలు, పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి మాట్లాడుతూ..అధికారులు సమయపాలన పాటించాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. విధుల్లో నిరక్ష్యం చేస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంత్రి వెంట మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, కమిషనర్‌ బాలకృష్ణ, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు. logo