శనివారం 23 జనవరి 2021
Nirmal - Jul 29, 2020 , 00:03:54

ప్రతి గ్రామంలో ప్రకృతి వనాలు

ప్రతి గ్రామంలో ప్రకృతి వనాలు

  • n ప్రజలకు ఆహ్లాదం, ఆక్సిజన్‌ అందించాలనేదే ఉద్దేశం..
  • n ‘హరితహారం’లో అందరూ భాగస్వాములవ్వాలి
  • n ఎమ్యెల్యే జోగు రామన్న
  • n బట్టిసావర్గంలో భూమి పూజ

ఆదిలాబాద్‌ రూరల్‌ : ప్రజలకు ఆహ్లాదం, ఆక్సి జన్‌ను అందించాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో ప్రకృతి వనాలను నిర్మిస్తున్నామని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. మావల మండలం బట్టిసావర్గంలో రూ.3.74 లక్షలతో ప్రకృతి వనం నిర్మాణ పనులను భూమి పూజ చేసి, ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హరితహారం’లో అందరూ భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. ప్రజలకు స్వచ్ఛమైన ప్రాణవాయువు అందించేందుకు ప్రకృతి వనాలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. ఇందులో భా గంగానే ప్రతి గ్రామంలో నిర్మిస్తున్నామని తెలిపారు. అలాగే రాష్ట్రంలో సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతున్నదన్నారు. రైతులంతా ఒక్కచోట సమావేశాలు నిర్వహించుకునేందుకు కోట్లాది రూపాయలతో ప్రభుత్వం రైతు వేదికలు నిర్మిస్తున్నదని పేర్కొన్నారు. అలాగే రైతు బంధు, రైతు బీమా, సమయానికి విత్తనాలు, ఎరువులు అందిస్తున్నట్లు చెప్పారు. రైతుల నుంచి మద్దతు ధరకు పంటలను కొనుగోలు చేసిందని గుర్తుచేశా రు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నల్లా వనిత, ఎం పీపీ చందాల ఈశ్వరి, సర్పంచ్‌ రాగం గంగమ్మ, ఎంపీటీసీ దర్శనాల సంగీత, టీఆర్‌ఎస్‌ నాయకులు నల్లా రాజేశ్వర్‌, రాజన్న, గోవర్ధన్‌, పవన్‌, కిరణ్‌, రాజు, ఎంపీడీవో అరుణ పాల్గొన్నారు.logo